ప్రాణాలు తీస్తున్న.. నారాసుర పానం! | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీస్తున్న.. నారాసుర పానం!

Oct 10 2025 6:40 AM | Updated on Oct 10 2025 6:40 AM

ప్రాణాలు తీస్తున్న.. నారాసుర పానం!

ప్రాణాలు తీస్తున్న.. నారాసుర పానం!

అమాయకులు బలి

కల్తీమద్యం పెద్దలను అరెస్ట్‌ చేయాలి

ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ మహిళా నేతల నిరసన

చిత్తూరు అర్బన్‌: ‘నారా’వారి కల్తీ మద్యానికి అమాయకులు బలవుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొలకలచెరువు నుంచి కల్తీ మద్యం ఏపీ మొత్తానికి సరఫరా అయ్యింది. ఆఫ్రికాలో ప్రణాళికలు రూపొందించి, పేదల ప్రాణాలను తీశారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు..?’ అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. కల్తీ మద్యం కేసులో పెద్దలను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం చిత్తూరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. హై రోడ్డు నుంచి స్థానిక అర్బన్‌ ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మద్యం బాటిళ్లను పగులగొట్టి నిరసన తెలిపారు. అనంతరం మహిళా విభాగం నాయకులు మాట్లాడుతూ మొలకలచెరువులో వెలుగుచూసిన కల్తీమద్యం తయారీ, కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రం మొత్తానికి పాకిందన్నారు.

ఈ మౌనం దేనికి సంకేతం?

‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నపుడు మద్యం బ్రాండ్లలో కుట్ర జరిగిపోయిందని మసిపూసి మారేడు కాయ చేశారు. తమ నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపించారు. ఏదో జరిగిపోయిందంటూ గ్లోబల్‌ ప్రచారానికి దిగారు. ఇప్పుడు నకిలీ మద్యంలో కూటమి నేతలు అడ్డంగా దొరికిపోయినా మౌనంగా ఉన్నారు. ఇది దేనికి సంకేతం...?’ అంటూ మహిళా నేతలు నిలదీశారు.

సరి‘హద్దు’లు దాటిన కల్తీ మద్యం

జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు దాటుకుని స్పిరిట్‌ చిత్తూరులోకి వస్తున్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని మహిళా నేతలు ఆరోపించారు. ఏడాదికిపైగా కల్తీ మద్యం జోరుగా సాగుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. అనంతరం ఎకై ్సజ్‌ పోలీసులకు వినతిపత్రం అందచేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శులు పీవీ.గాయత్రీదేవి, లీనారెడ్డి, మునిసిపల్‌ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు అంజలి రెడ్డి, జిల్లా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు హరీషారెడ్డి, కార్పొరేటర్‌ భాగ్యలక్ష్మిరెడ్డి, కౌసర్‌, పూంగొడి, బిందు, శాంతి, లత, విజయశాంతి, సృజన పాల్గొన్నారు.

బడా‘బాబు’లను అరెస్ట్‌ చేయాలి!

కూటమి పార్టీకి చెందిన బడా నాయకుల పేర్లు బయటరాకుండా ప్రభుత్వం కల్తీ మద్యం కేసును నీరుగార్చేందుకు చూస్తోందని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నేతలు ఆరోపించారు. నారా వారి నకిలీ మద్యం కేసులో దోషులందరినీ అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు కల్తీమద్యం తాగి మృతి చెందిన బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. నకిలీ మద్యంలో వచ్చిన రూ.కోట్లను కూటమి నేతలంతా పంచుకున్నారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని బెల్టు దుకాణాలకు, పలు మద్యం దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా అయ్యిందని, వీటిని కుటీర పరిశ్రమలుగా నడుపుతున్నారని ఆరోపించారు.

ఏరులై పారుతున్న కల్తీ మద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement