సేవాభావంతో రెడ్‌క్రాస్‌ పని చేయాలి | - | Sakshi
Sakshi News home page

సేవాభావంతో రెడ్‌క్రాస్‌ పని చేయాలి

Oct 7 2025 3:24 AM | Updated on Oct 7 2025 3:24 AM

సేవాభ

సేవాభావంతో రెడ్‌క్రాస్‌ పని చేయాలి

తిరుపతి అర్బన్‌: ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ సేవాభావంతో పనిచేయాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వార్షిక సాధారణ సమావేశాన్ని కలెక్టర్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ వెంకటేశ్వర్‌ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కమిటీని దాదాపు వందమంది సభ్యుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుని 11 మంది సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, ట్రెజరర్‌ను ఎన్నుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ఎనిమిది మంది సభ్యులు ఈ కొత్త కమిటీలో ఉన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తిరుపతి జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారు ‘‘కరుణ, నిబద్ధతతో మానవ సేవ’’ అనే రెడ్‌ క్రాస్‌ ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అధ్యక్షుడిగా డాక్టర్‌ దగ్గుబాటి శ్రీహరి రావు, ఉపాధ్యక్షుడిగా మయూర్‌ గుడ్లూరు, కార్యదర్శిగా డాక్టర్‌ ప్రతీత్‌, ట్రెజరర్‌గా జీవీ సుబ్బారావు, కృష్ణకుమార్‌, సభ్యులుగా డాక్టర్‌ భారతి, గుణశేఖర్‌, శ్రీనివాసులు రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, శివకుమార్‌, శ్రీనివాస్‌, ఎన్‌ఎస్‌ రవిని సభ్యులుగా ఎనుకున్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ ఉపాధ్యక్షులు, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు సమావేశానికి అధ్యక్షత వహించగా, ట్రెజరర్‌ రామచంద్రరాజు రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా హాజరై ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.

పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇద్దాం

పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇద్దామని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం స్వచ్ఛాంధ్రా–స్వర్ణాంధ్రలో భాగంగా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి నెలలో మూడవ శనివారం వినూత్న థీమ్‌తో స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ నాటికి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్‌ నిర్మూలించే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. తిరుపతి జిల్లాకు మొత్తం 18 కేటగిరిలలో 51 అవార్డులు దక్కాయని, ఇందులో రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ మున్సిపాలిటీలలో తిరుపతికి ఒక అవార్డు వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో గ్రీన్‌ అండ్‌ బ్యూటీషియన్‌ చైర్‌పర్సన్‌ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహయాదవ్‌, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సదాశివం, డీపీఓ సుశీలాదేవి తదితరులు పాల్గొన్నారు.

సేవాభావంతో రెడ్‌క్రాస్‌ పని చేయాలి 1
1/1

సేవాభావంతో రెడ్‌క్రాస్‌ పని చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement