
మిగిలిపోయిన భోజనం పెట్టొద్దు
తిరుపతి అర్బన్:వసతిగృహాల్లోని పిల్లలకు పెళ్లితో పాటు ఇతర కార్యక్రమాల్లో మిగిలిపోయిన భోజనాన్ని పెట్టొద్దని కలెక్టర్ వెంకటేశ్వర్ వార్డన్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడాది కాలంలో పలుచోట్ల వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులు కలుషిత ఆహారం తీసుకోవడంతో ఆరోగ్య ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు అందించే ఆహారం, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే దెబ్బతిన్న భవనాలు ఉంటే పిల్లలను సురక్షితమైన మరో ప్రాంతానికి బదిలీ చేయాలని కోరారు. వర్షాల నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నా రు. పిల్లల ఆరోగ్య రక్షణకు తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్కూల్ జోన్ పరిధిలో క్లోరినేషన్ చేపట్టాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదే శించారు. కార్యక్రమంలో డీపీవో సుశీలాదేవి, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి విక్రమ్‌కుమార్‌రెడ్డి, డీఈవో కేవీఎన్ కుమార్, గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయకర్త పద్మజ, డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్ పాల్గొన్నారు.