
నాలుగు రోజులుగా తిరుగుతున్నా
ఓవైపు క్యూలు.. మరోవైపు పడిగాపులు రబీలో వరినాట్లకు సిద్ధంగా నారుమడులు సకాలంలో యూరియా అందక అగచాట్లు అన్నదాతల అవస్థలు ప్రభుత్వానికి పట్టవా?
నాకు రెండెకరాల పొలం ఉంది. యూరియా కోసం నాలుగు రోజులుగా తిరుగుతూనే ఉన్నా. గుర్తింపు కార్డు ఉంటేనే యూరియా ఇస్తామంటున్నారు. అందు కోసం వివరాలు సమర్పించా. అయినా అందలేదు. రూ. 270 యూరియా బస్తా కోసం రూ. 500 అదనపు ఖర్చు అవుతోంది.
– సుబ్రమణ్యం, రైతు, నాగనందాపురం
ఇంత దారుణం ఎప్పుడూ లేదు
యూరియా కోసం ఇన్ని ఇబ్బందులు పడడం ఎప్పుడూ లేదు. ఇలా ఉంటే వ్యవసాయం కష్టం. యూరియా కోసం తిరగడానికే సమయం సరిపోతుంది తప్ప సకాలంలో వ్యవసాయ పనులు చేపట్టలేం. రైతులను ఇంతగా ఇబ్బంది పెట్టడం సరికాదు. రైతే దేశానికి వెన్నెముక అంటారు గానీ అది ఆచరణలో సాధ్యం కావడం లేదు.
– ముద్దుకృష్ణా రెడ్డి, రైతు, గూడలవారిపాళెం
గుర్తింపు కార్డుల పంపిణీ మొదలు పెట్టాం
యూరియా పంపిణీ కోసం రైతులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నాం. ఇప్పటికే వివరాలు అందజేస్తున్న రైతులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే యూరియా అందజేస్తాం. మొదటి విడతగా 1200 బస్తాలు తెప్పించాం. మూడు విడతల్లో యూరియా పంపిణీ ప్రక్రియ జరుగుతుంది.
– గౌరి, ఏఓ, వరదయ్యపాళెం మండలం
●
వరదయ్యపాళెం : యూరియా కోసం రైతుల పాట్లు మొదలయ్యాయి. మండల వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు రైతులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే వరదయ్యపాళెం మండలంలో రబీలో వరినాట్ల కోసం పూర్తి స్థాయిలో నారు మడులను సిద్ధం చేసుకున్నారు. వాటికి తక్షణమే యూరియా వేయాల్సి ఉంది. అందు కోసం వారం రోజుల నుంచి అటు కార్యాలయం , ఇటు ప్రైవేటు డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతులపై నిబంధనల కత్తి
ప్రభుత్వం యూరియాపై పలు ఆంక్షలు విధిస్తోంది. ఆ దిశగా పొలం ఉన్న రైతుకు యూరియా పంపిణీ కోసం రబీ సీజన్‌లో ప్రభుత్వం ద్వారా ఇచ్చే గుర్తింపు కార్డు తీసుకున్న రైతుకు మాత్రమే యూరియా పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ దిశగా గుర్తింపు కార్డు పొందిన రైతుకు మూడు విడతల్లో ఎకరాకు 3 బస్తాలు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అందుకు సంబంఽధించి రైతులు గుర్తింపు కార్డులు పొందేందుకు మండల వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు క్యూ కడుతున్నారు. అది కూడా పొలానికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఆన్‌లైన్ నమోదు వివరాలను క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బందికి అందజేసిన వారికి రెండు రోజుల తర్వాత కార్డులను జారీ చేస్తున్నారు. తదుపరి యూరియా సరఫరా జరుగుతుందని అధికారులు చెబుతుండడం గమనార్హం.
గుర్తింపు కార్డుల కోసం వేచి ఉన్న రైతులు
గుర్తింపు కార్డు ఉంటేనే యూరియా
వేధిస్తున్న సిబ్బంది కొరత
సత్యవేడు నియోజకవర్గంలో అత్యధికంగా రబీ సీజన్‌కు 12 వేల ఎకరాల్లో వరిసాగు వరదయ్యపాళెం మండలంలోనే సాగవుతుంది. అయితే క్షేత్రస్థాయి వ్యవసాయ సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయి. అటు ఈ–క్రాప్ బుకింగ్, ఇటు యూరియా పంపిణీ ఉన్నా అరకొర సిబ్బందితో సజావుగా జరిగే పరిస్థితి లేదని ఆ శాఖ అధికారులు ఆవేదన చెందుతున్నారు. మండలంలో 11 రైతు సేవా కేంద్రాలు ఉండగా అక్కడ విధులు నిర్వహించాల్సిన సిబ్బంది ఆరుగురు మాత్రమే ఉన్నారు. దీంతో ఐదుగురు సిబ్బంది కొరత కారణంగా ఎక్కడికక్కడ పనులు ఆగిపోతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

నాలుగు రోజులుగా తిరుగుతున్నా

నాలుగు రోజులుగా తిరుగుతున్నా

నాలుగు రోజులుగా తిరుగుతున్నా

నాలుగు రోజులుగా తిరుగుతున్నా

నాలుగు రోజులుగా తిరుగుతున్నా

నాలుగు రోజులుగా తిరుగుతున్నా