
తల్లుల వేదన.. బిడ్డల రోదన
రుయా చిన్నపిల్లల ఆసుపత్రి వరండాలో మంచాలపై బాలింతలను ఉంచిన దృశ్యం
లగేజీలతో నేలపై సేద తీరుతున్న బాలింతల సహాయకులు
రాయలసీమకే తలమాణికమైన శ్రీ వెంకటేశ్వర రామనారాయణ రుయా ప్రభుత్వ సర్వజన చిన్నపిల్లల ఆసుపత్రిలో బాలింతల వేదన.. బిడ్డల రోదనతో ఆసుపత్రి దద్దరిల్లింది. బాలింతలకు వసతుల కల్పనలో ఆసుపత్రి ఉన్నతాధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. వార్డులు ఉన్నప్పటికీ వార్డు బయట మెట్ల పక్కన ఉన్న సన్‌సైడ్ గోడల కింద బెడ్లను వేసి బాలింతలు, పురిటి బిడ్డలకు నరకం చూపెట్టారు. ఓ వైపు దోమల విజృంభన, భరించలేని దుర్వాసనకు తోడు చలిగాలులతో బాలింతలు, బిడ్డల అవస్థలు అన్నీ ఇన్ని కావు. మరోవైపు సహాయకులు సైతం నేలపై పడుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఫ్రిజ్జులు, కొళాయిలు సైతం పనిచేయకపోవడంతో బాలింతలు, సహాయకులు అగచాట్లు పడ్డారు. లిఫ్టు పనిచేయకపోవడం, నిరుపయోగంగా ఉన్న బెడ్లు, మంచాలు, వీల్‌చైర్లు, పనికిరాని వస్తువులను అక్కడే నిర్లక్ష్యంగా పడేశారు. వాటి పక్కనే బాలింతలు, చంటి బిడ్డలను ఉంచడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, తిరుపతి

తల్లుల వేదన.. బిడ్డల రోదన

తల్లుల వేదన.. బిడ్డల రోదన

తల్లుల వేదన.. బిడ్డల రోదన

తల్లుల వేదన.. బిడ్డల రోదన

తల్లుల వేదన.. బిడ్డల రోదన