
దాడి చేసి దోపిడీ
నాగలాపురం : మండలంలోని బంగారునాయుడు కండ్రిగ వద్ద శనివారం రాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు దుండగులు దాడి చేసి రెండు గ్రాముల బంగారు ఉంగరం, రూ.25వేల విలువైన సెల్‌ఫోన్‌ను దోచుకున్నారు. వివరాలు.. పిచ్చాటూరు మండలం అప్పలరాజు కండ్రిగకు చెందిన వెంకటేశులు తమిళనాడులోని ఊత్తుకోటలో ఉన్న హోటల్‌లో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి వస్తుండగా మాస్క్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు అడ్డుకున్నారు. ఇనుప రాడ్లతో దాడి చేసి గాయపరిచారు. వెంకటేశులు సొత్తును దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితుడు ప్రస్తుతం సత్యవేడు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.