
తిరుమలలో అప్రమత్తమైన పోలీసులు
తిరుమల : తమిళనాడులో తొక్కిసలాట జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డిని తిరుమలకు పంపించారు. తిరుమల గరుడ సేవలో భద్రతపై జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుని ఆరా తీసి పలు ప్రాంతాల్లో పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపట్టారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో జాయింట్ స్క్రీన్‌ల ద్వారా పరిశీలించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక క్రౌడ్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను అమలు చేస్తున్నామన్నారు. భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ , ఎమర్జెన్సీ సర్వీసులు వైద్య బృందాలు కదలికపై అధికారులు ప్రత్యేక సూచనలు తెలిపారు.
జిల్లాకు ఉత్తమ
ప్రకృతి విస్తరణ అవార్డు
తిరుపతి అర్బన్:గుంటూ రు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ నెల 26, 27 తేదీల్లో ప్రకృతి వ్యవసాయంపై ఏరువాక ఫౌండేషన్ వారు కిసాన్ మహోత్సవం –2025 కార్యక్రమంలో భాగంగా ప్రతిభావంతులైన ప్రకృతి జిల్లా అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి షణ్ముగంకు ఉత్తమ అవార్డు అందుకున్నారు.

తిరుమలలో అప్రమత్తమైన పోలీసులు