ఉయ్యాలపల్లిలో విషాదఛాయలు
చిన్నారులను పొట్టన పెట్టుకున్న గ్రావెల్ మాఫియా
కలువాయి(సైదాపురం): మట్టి మాఫియా దాహానికి ఇ ద్దరు చిన్నారులు బలయ్యారు. సరదాగా ఆడుతూ..పాడుతూ.. కలేకాయల కోసం వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యుఒడిలోకి చేరుకున్నారు. సమీపంలోనే గుంతల్లో ఇరుకున్న విషయం తెలుసుకున్న పోలీసుల బృందం బురద గుంతల్లో గురువారం మధ్యాహ్నం వరకు శ్రమించి మృతదేహాలను వెలికి తీశారు. ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. వివరాలిలావున్నాయి.
ఉయ్యాలపల్లి గ్రామానికి చెందిన నూతే టి ప్రసాద్, లక్ష్మీదేవి దంపతుల కుమారుడు నూ తేటి విష్ణుకుమార్(11) స్థానిక నవభారత్ స్కూల్‌లో మూ డో తరగతి చదువుతున్నాడు. అలాగే అదే గ్రామానికి చెందిన మనబోటి నరసింహులు, సునీత దంపతుల కుమారుడు మనోబోటి నవశ్రావణ్ స్థానిక ఎంపీయూపీ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదుపుతున్నా డు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు కావడంతో ఎక్కడికి వెళ్లినా ఇద్దరే వెళ్లి సరదాగా ఆడుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.
ఈ క్రమంలో గ్రామానికి సమీపంలో డ్రాగన్‌ప్రూట్ తోట ఉండడంతో ఇద్దరు స్నేహితులు కలసి డ్రాగన్ ప్రూట్స్, కలేకాయల కోసం బుధ వారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లారు. చీకటిపడినా ఇంటికి రాకపోవడంతో ఇరు కుటుంబాల సభ్యు లు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. దీంతో స్థాని క పోలీసులకు సమాచారం అందించడంతో నెల్లూరు జిల్లా ఎస్పీ వి.అజిత ఆదేశాల మేరకు సంగం సీఐ వే మారెడ్డి, రాపూరు, కలువాయి, మర్రిపాడు, చేజర్ల ఎస్‌ఐలు ఉయ్యాలపల్లి గ్రామానికి బుధవారం రాత్రి చేరుకున్నారు. అనంతరం పిల్లల ఆచూకీ కోసం గ్రామస్తులతో కలసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో రంగంలోకి డాగ్‌స్కాడ్, డ్రోన్ కెమెరాలను ఘటన స్థలానికి తీసుకువచ్చి మరో కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు.
బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యా హ్నం వరకు ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఆ సమయంలో ఉ య్యాలపల్లి సమీపంలోని చెరువు వద్ద మట్టి మాఫి యా తవ్విన గుంతల్లో మృతదేహాలు ఉన్నాయంటూ స్థానికులు పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచా రం అందించారు. దీంతో హుటాహుటిన సంగం సీఐ వేమారెడ్డి, రాపూరు, సైదాపురం, మర్రిపాడు, చేజర్ల ఎస్‌ఐలు వెంకటరాజేష్, క్రాంతికుమార్, శ్రీనివాసు, తిరుమలరావు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా బురదమయంగా ఉండడంతో యంత్రాల సహాయంతో నీటిని తోడారు. మృతదేహాలను బయటకు తీశారు. అక్కడే ఉన్న వారంతా విష్ణు, శ్రావణ్ మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. మట్టి గుంతలు చిన్నారుల ప్రాణాలుతీశాయంటూ మృతుల కుటుంబాల సభ్యుల శాపనార్థాలు పెట్టారు. చిన్న వయసులోనే నిండి నూరేళ్లు నిండాయా? అంటూ రోదించారు.
కుటుంబ నేపథ్యం..
ఉయ్యాలపల్లికి చెందిన నూటేటి ప్రసాద్ లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారెలు ఉన్నా రు. అతను బతుకు దెరువుకోసం కువైట్‌కు వెళ్లి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మృతి చెంది న విష్ణుకుమార్ చివరి వాడు కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించేందుకు ప్రసాద్ కువైట్‌కు వెళ్లి రూపా యి రూపాయి కూడపెట్టి పిల్లలను చదివిస్తున్నారు. ఈ క్రమంలో విష్ణుకుమార్‌ను కూడా ప్రైవేటు పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.
ప్రసాద్ కూడా ఇటీవల కువైట్ దేశం నుంచి స్వగ్రామానికి వచ్చారు. మళ్లీ కువైట్‌కు వెళ్లే సమయంలో ఈ విషాదం నెలకొనడంతో తమ ఆశలు ఆడియా శలు ఆయ్యాయాంటూ రోధించడం అందరిని కలచివేసింది. అలాగే మనుబోటి నరసింహులు టిప్పర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ భార్య సునీత ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చదువిస్తు న్నారు. రెండో కుమారుడు నవ శ్రావణ్ నీటి గుంతలో పడి మృతి చెదడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
విష్ణుకుమార్, నవశ్రావణ్ చదివేది వేర్వేరు పాఠశాలలు, వేర్వేరు తగతులైనా ఇద్దరు చిన్నతనం నుంచే ఆడుతూ,పాడుతూ మంచి స్నేహితులుగా ఉండేవారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి మెలసి వెళుతూ గ్రామంలో సందడిగా ఉండేవారు. అంతటి స్నేహితులైన వారి మరణం కూడా వారిని విడతీయలేకుండా పోయింది. ఇద్దరూ చనిపోయారా? నాయనా అంటూ.. గ్రామస్తులు, బంధువులు బోరున విలపించారు.

మృతదేహాల కోసం పడిగాపులు పడుతున్న గ్రామస్తులు

మరణంలో కూడా వీడని స్నేహబంధం