
పడగల నీడన పరంథాముడు
నయనానందకరంగా కల్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు
చిన్న శేష వాహనం, హంస వాహనంలపై శ్రీహరి చిద్విలాసం
భక్తులకు కనువిందు చేసిన స్నపన
తిరుమంజనం
ఊంజల సేవతో దేవేరులతో కలసి ఊయలూగిన శ్రీవారు
తిరుపతి రూరల్: తుమ్మలగుంట కళ్యాణ వేంకశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం కల్యాణ వేంకటేశ్వరస్వామి చిన్న శేష వాహనంపై శ్రీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నశేషునిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. విశేషాలంకార భూషితుడైన స్వామి వారు చిన్నశేషునిపై కొలువుదీరి మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. చిన్న శేష వాహన సేవలో తరించిన భక్తుల గోవింద నామ స్మరణలతో తుమ్మలగుంట గ్రామం పులకించింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి, ఆమె కుమారులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితోపాటు చెవిరెడ్డి సోదరుడు చెవిరెడ్డి రఘునాథరెడ్డి, మంజుల దంపతులు వాహన సేవల్లో పాల్గొన్నారు.
హంస వాహనంపై మలయప్ప
కల్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారం రాత్రి హంస వాహనంపై స్వామివారు సరస్వతీ దేవిగా భక్తులను కటాక్షించారు. చెవిరెడ్డి కుమారులైన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డిలు వాహనం మోసి తమ భక్తిని చాటుకున్నారు. గోవింద మాల ధరించిన ఆ ఇద్దరితో పాటు యువకులు గోవింద నామస్మరణలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వివిధ దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు ఆకట్టుకున్నారు. అంతకు ముందు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ఊంజల్ మండపంలో నిర్వహించిన ఊంజల్ సేవను భక్తులు వీక్షించి భక్తి సాగరంలో మైమరిచారు.
ఆకట్టుకున్న కళా బృందాలు
బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళా బృందాలు, భజన బృందాలు భక్తులను ఆకట్టుకున్నా యి. చిన్నశేష, హంస వాహన సేవలో పాల్గొన్న భక్తు లు స్వామిని దర్శించడంతో పాటు వాహనం ముందు వెళుతున్న కళాకారులు, భజన బృందాలను కళ్లా రా వీక్షించి భక్తి సాగరంలో మునిగారు. కోలాటాలు, చెక్కభజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

పడగల నీడన పరంథాముడు

పడగల నీడన పరంథాముడు

పడగల నీడన పరంథాముడు

పడగల నీడన పరంథాముడు