
ప్రశ్నించే గొంతుకపై కక్ష
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం అన్యాయం. ఒక నాయకుడు ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలను ప్రచురిస్తే మీడియాపై కేసులు పెట్టడం విడ్డూరంగా ఉంది. ఇలా కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపై గౌరవభావం కలిగి ఉండాలి. భయపెట్టి నిజాలను కప్పివేయాలనుకోవడం సరికాదు. పత్రికా స్వేచ్ఛకు, వాక్‌స్వాతంత్య్రపు హక్కుకు సంకెళ్లు ఎలా వేస్తారని ప్రశ్నిస్తున్నా?. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే ధోరణిని మానుకోవాలి. అన్యాయంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి.
– చైతన్య, విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి