
లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
రేణిగుంట : కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాకు చెందిన మహబూబ్(30) అనే లారీ డ్రైవర్ రేణిగుంట మండలంలోని కేఎల్‌ఎం హాస్పిటల్ సర్కిల్ సమీపంలోని అశోక్ లైలాండ్ సర్వీస్ పాయింట్ వద్ద అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గాజుల మండ్యం ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున డ్రైవర్ మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఎస్‌వీ మెడికల్ కళాశాలకు తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నాయుడుపేటలో నిలిచిన పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు
– తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
నాయుడుపేటటౌన్ : నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో మంగళవారం పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచి పోయి ఆలస్యంగా నడిచాయి. విజయవాడ నుంచి చైన్నెకు వెళుతున్న పినాకిని ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం మధ్మాహ్నం గంట పాటు నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో నిలిపి వేశారు. తడ సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేస్తుండడంతో పలు రైళ్లను గూడూరు, నాయుడుపేట, దొరవారిసత్రం రైల్వే స్టేషన్‌లలో నిలిపేశారు. బ్రిడ్జి వద్ద రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు పూర్తి చేసి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తరువాత రైళ్లు ఒకే ట్రాక్‌పై రాకపోకలు జరిపాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వచ్చే ఏడాది జాతీయ స్థాయి ఖో–ఖో పోటీలు
తిరుపతి సిటీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జాతీయ స్థాయి ఖో–ఖో పోటీలకు ఎస్వీయూ ఆతిథ్యమిస్తున్నట్టు వీసీ అప్పారావు తెలిపారు. మంగళవారం వీసీతోపాటు పలు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, పీడీ ప్రొఫెసర్ శివశంకర్‌రెడ్డి ఖో–ఖో పోటీల పోస్టర్లను ఆవిష్కరించారు.

లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి