
నేత్రపర్వం.. తెప్పోత్సవం
తెప్పోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు
కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి తెప్పపై విహరిస్తూ మంగళవారం కనువిందు చేశారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం, అనంతరం చందనాలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి సిద్ధిబుద్ధి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను అన్వేటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారిని వేంచేపుగా పుష్కరిణి వద్దకు తీకొచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామి వారిని సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై ఆశీనులను చేశారు. స్వామివారు పుష్కరణిలో తెప్పపై విహరిస్తూ భక్తులకు అభమిచ్చారు.
పోటెత్తిన భక్తులు
తెప్సోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. బ్రహ్మోత్సవ ఘట్టం చివరిది కావడంతో భక్తులు పోటెత్తారు. స్వామి దర్శనం కోసం క్యూలన్నీ నిండిపోయాయి. భకుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. తెప్పోత్సవంతో కాణిపాక వరసిద్ధుని ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ముగిశాయి.