
స్కిల్స్ కాంపిటీషన్ పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి అర్బన్ : కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ చేతుల మీదుగా ఇండియా స్కిల్స్ కాంపిటీషన్–25 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి 16–25 ఏళ్ల యువత అర్హులుగా జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి లోకనాథం తెలిపారు. ఈనెల 30లోపు ఈకేవైసీ ధ్రువీకరణ సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉందని వెల్లడించారు. స్కిల్ ఇండియా డిజిటల్ హాబ్‌లో ఎస్‌ఐడీహెచ్ పొర్టల్‌లో ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని వివరించారు. అదనపు సమాచారం కోసం 99666 01867, 72073 89948 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ పోటీల్లో విజేతలకు అంతర్జాతీయ స్థాయిలో అవార్డును అందిస్తారు. అంతే కాకుండా స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవడానికి ఈ పోటీలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ ఉద్యోగులు గణేష్, సురేష్, దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
ఎంబీయూలో ముగిసిన
అంతర్జాతీయ సదస్సు
చంద్రగిరి : రెండు రోజుల పాటు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ)లో డేటా సైన్స్ విభాగం, స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్ ఆధ్వర్యంలో ఐఈఈఈ–2025 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్ (ఐసీఏసీటీ 2025) కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈ సదస్సులో కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఎల్‌ఓటి), సస్టైనబుల్ కంప్యూటింగ్‌లపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక కంప్యూటింగ్ వాస్తవ ప్రపంచ సమస్యల పరిష్కారం, డిజిటల్ రూపాంతరానికి మార్గదర్శకంగా ఉండటంలో ప్రాముఖ్యంపై చర్చించారు. ఈ సదస్సు ద్వారా యువ పరిశోధకులు, విద్యార్థులు తమ పరిశోధన పత్రాలను ప్రదర్శించి, గ్లోబల్ నిపుణులతో చర్చించే వేదికను పొందారని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఐఈఈఈకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవాలకు బస్సుల ఒప్పందం
తిరుపతి అర్బన్: తిరమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బస్సుల రాకపోకలపై తమిళనాడు– తిరుపతి జిల్లా ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మంగళవారం నగరంలోని డీపీటీఓ కార్యాలయంలో సమావేశమై చర్చించారు. ఈ నెల 23 నుంచి ఆక్టోబర్ 6 వరకు బ్రహ్మోత్సవాలు సందర్భంగా ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు. తమిళనాడు నుంచి 150 బస్సులు, తిరుపతి జిల్లా నుంచి 150 బస్సులను తమిళనాడుకు నడపాలని నిర్ణయించారు.డీపీటీఓ జగదీష్, డిప్యూటీ చీప్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాధం, డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజినీర్ బాలాజీ, , తమిళనాడు ఆర్టీసీ అధికారులు మోహన్, గుణశేఖరన్, సేలం పాల్గొన్నారు.

స్కిల్స్ కాంపిటీషన్ పోస్టర్ ఆవిష్కరణ