
మిథున్‌రెడ్డి విడుదల కావాలని పూజలు
నారాయణవనం : రాజకీయ కుట్రతో లిక్కర్ కేసులో రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమమని సత్యవేడు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ పేర్కొన్నారు. మంగళవారం నారాయణవనం బైపాస్ వైఎస్సార్ సర్కిల్ నుంచి వినాయకస్వామి ఆలయం వరకు ఫ్లకార్డులతో నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అక్రమ కేసు నుంచి క్లీన్‌చిట్ రావాలని వినాయకస్వామికి అర్చనలు చేసి 108 కొబ్బరి కాయలను కొట్టారు. ఈ సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాదరణ ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ కేసులతో అరెస్ట్ చేస్తే పార్టీ శ్రేణులు భయపడే కాలం చెల్లిపోయిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా జగనన్న ప్రారంభించి, పూర్తి చేసిన పనులు తామే చేసినట్లు కాలం వెలిబుచ్చుతున్నారని ఎద్దేవా చేశారు. నిరసనలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరేంద్రరాజు, మండల కన్వీనర్ సొరకాయలు, ఎంపీపీ దివాకర్‌రెడ్డి, ముఖ్య నాయకులు భానుప్రకాష్‌రెడ్డి, అన్నాదొరై, రాకేష్ కిరణ్, వైస్ ఎంపీపీ శివశంకర్, ఎంపీటీసీ సభ్యులు రవి, పొన్నుస్వామి, శంకరయ్య, సర్పంచ్‌లు సాయిరవి, తుంబూరు నాగూరు, సుబ్రమణ్యంరెడ్డి, తిరువట్యం నాగూరు, గుణశేఖర్, మురళి, నాయకులు పాల్గొన్నారు.