
రథోత్సవం
రమణీయం..
కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం రమణీయంగా రథోత్సవం చేపట్టారు. సిద్ధి..బుద్ధి సమేతంగా స్వామివారిని రథంపై కొలువుదీర్చారు. కళాకారులు నృత్యప్రదర్శనలు.. కోలాటాలు.. మంగళవాయిద్యాల నడుమ మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. అశేష భక్తజనులు హాజరై గణనాథుని రథంపై మిరియాలు చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా పండ్ల పరిశ్రమ సంఘం.. ఆల్ ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ వారు అందించిన మామిడి జ్యూస్‌ను భక్తులకు పంపిణీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం తిరు కల్యాణం.. రాత్రి అశ్వవాహన సేవ నిర్వహించనున్నట్లు ఈఓ పెంచలకిషోర్ తెలిపారు.
– కాణిపాకం

రథోత్సవం

రథోత్సవం