
● గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలు ● లబోదిబోమంటున్న అన్నద
సైదాపురం: జిల్లాలో ద్యానపంటలు సుమారు 30 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో మామిడి 24 హెక్టార్లు, నిమ్మ 4 వేల హెక్టార్లు, రెండు వేల హెక్టార్లలో అరటి, పూలు, జామ తదితర పంటలు సాగుచేస్తున్నారు. అలాగే వరి దాదాపు లక్ష ఎకరాల్లో సాగైంది. ప్రధానంగా నిమ్మ, మామిడి రైతుకు ఈ ఏడాది నష్టాలు తప్పలేదు. వేసవిలోనూ కిలో నిమ్మ కాయలు రూ.50 నుంచి రూ.70 లోపే పకాయి. అదే కిలో నిమ్మకాయలు గత ఏడాది రూ.150కి పైగా పలికాయి. మిరప, టమాట, చినీ, అరటి రైతుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
అన్నదాత సుఖీభవ ఏదీ?
గత ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు పూర్తవుతున్నా నేటికీ రైతులకు ఎలాంటి ప్రయోజనం లభించ లేదు. కనీసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేదు. గత ప్రభుత్వం రైతు భరోసా అందించి ఆదుకుంది. ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడిస్తుందో తెలియడం లేదు.
– శ్రీనివాసులురాజు, రైతు

● గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలు ● లబోదిబోమంటున్న అన్నద

● గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలు ● లబోదిబోమంటున్న అన్నద