
స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతి వరదరాజనగర్‌లోని విశ్వం పాఠశాలలో శనివారం సైనిక్, నవోదయ పోటీ పరీక్షల అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్సీ ఎంవీ.రామచంద్రారెడ్డి, అపుస్మా రాష్ట్ర అడకమిక్ కోఆర్డినేటర్ వీఆర్.రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ సైనిక్, నవోదయ, మిలటరీ స్కూల్స్ తదతర పోటీ పరీక్షల్లో విశ్వం విద్యార్థులు సీట్లు సాధిస్తుండడం గర్వకారణమని తెలిపారు. విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న విశ్వం విద్యాసంస్థను అభినందించారు. విశ్వం విద్యాసంస్థ అధినేత ఎన్.విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత 34 ఏళ్లుగా అనుభజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత సమాచారానికి 86888 88802, 93999 76999 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో విశ్వం విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్వీయూలోని
హాస్టళ్ల తనిఖీ
తిరుపతి సిటీ: ఎస్వీయూలో విద్యార్థుల హాస్టల్ గదులు, బ్లాక్‌లను శనివారం రాత్రి వీసీ ఆచార్య అప్పారావు, రిజిస్ట్రార్ ఆచార్య భూపతి నాయుడు, వార్డెన్లు, ప్రిన్సిపాల్ తనిఖీ చేశారు. వర్సిటీ హాస్టళ్లలో కొంతమంది అనధికారికంగా తిష్టవేసి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై గత వారం సాక్షి దినపత్రికలో శ్రీఅనధికార వసతిశ్రీ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన అధికారులు తనిఖీలు చేపట్టారు. కొన్ని నెలలుగా అనధికారికంగా, విశ్వవిద్యాలయానికి డబ్బు చెల్లించకుండా విద్యార్థులు వుంటున్న గదులకు తాళం వేశారు. బయట వ్యక్తులు, రాజకీయ పార్టీలకు అనుబంధంగా చెలామణి అవుతున్న వారు ఐ బ్లాక్, ఎఫ్ బ్లాక్‌లో కొన్నేళ్లుగా వుంటున్నారు. వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఆ రెండు బ్లాక్‌లను తాత్కాలికంగా మూసివేయాలని వార్డెన్లను ఆదేశించారు.
31 వరకు బీఆర్‌ఏఓయూ డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు
తిరుపతి సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోని ఆ వర్సిటీ అధ్యయన కేంద్రం రీజనల్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గుర్తించి గడువులోపు ఫీజు చెల్లించాలని కోరారు.