పేరుకే తిరుపతి జిల్లా.. | - | Sakshi
Sakshi News home page

పేరుకే తిరుపతి జిల్లా..

May 16 2025 1:17 AM | Updated on May 16 2025 1:17 AM

పేరుక

పేరుకే తిరుపతి జిల్లా..

తిరుపతి అర్బన్‌ : పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పరిపాలన సౌలభ్యం కోసం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జిల్లాల పునర్విభజన 2022 ఏప్రిల్‌ 4న చేపట్టారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా నుంచి కొన్ని మండలాలు, నెల్లూరు జిల్లా నుంచి కొన్ని మండలాలను విభజించి 34 మండలాలతో కొత్తగా తిరుపతి జిల్లా ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాలు ఏర్పాటై మూడేళ్లు పూర్తయింది. ఇప్పటికీ అనేక కార్యాలయాలు చిత్తూరు కేంద్రంగానే నడిపిస్తున్నారు. పలు కార్యాలయాలకు కలెక్టరేట్‌లో చాంబర్లు కేటాయింపు చేశారు. కానీ ఉద్యోగులను కేటాయించలేదు. దీంతో పలు కార్యాలయాల చాంబర్లకు తాళాలే దర్శనమిస్తున్నాయి. తిరుపతి జిల్లా ఏర్పాటు చేసినా ఇబ్బందులు తప్పడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు.

చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న కార్యాలయాలు

ఎస్సీ కార్పొరేషన్‌ అధికారం ఈడీ చెన్నయ్య చేతుల్లో ఉంది. అయితే ఆయన చిత్తూరు ప్రధాన కార్యాలయంలోనే ఉంటున్నారు. తిరుపతి జిల్లాకు కలెక్టరేట్‌లో ఓ చాంబర్‌ను అయితే కేటాయింపు చేశారు. అయితే అక్కడ ఎవరూ ఉండడం లేదు. అలాగే ఇటీవల బీసీ కార్పొరేషన్‌ , మైనారిటీలకు సంబంధించి రాయితీ రుణాలు మంజూరు చేశారు. వాటి కోసం దరఖాస్తు చేసుకునే వారు పలువురు కలెక్టరేట్‌కు వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చిత్తూరు వెళ్లక తప్పని పరిస్థితి దాపురిస్తోంది.

పరిష్కారం కాని విభజన సమస్యలు

ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్‌లు చిత్తూరుకే పరిమితం

మూడేళ్లు దాటిన జిల్లా పునర్విభజన

ఖాళీగా కలెక్టరేట్‌లో కార్పొరేషన్‌ చాంబర్లు

కూటమి సర్కార్‌లో పట్టించుకోని

కార్పొరేషన్ల విభజన

ఎస్సీ కార్పొరేషన్‌ తిరుపతి నుంచే చేపట్టాలి

ఎస్సీ కార్పొరేషన్‌ కార్యకలాపాలు తిరుపతి నుంచే చేపట్టాలి. తిరుపతిలో కార్యాలయం ఉంటే పదే పదే వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే చిత్తూరులోనే రెండు జిల్లాలకు చెందిన ఈడీ కార్యాలయం ఉండడంతో అక్కడికి ప్రతిసారి వెళ్లలేకపోతున్నాం. తిరుపతి జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రత్యేక ఈడీని నియమించాలి.

– అజయ్‌కుమార్‌, ఎస్సీ నేత తిరుపతి

బీసీ కార్పొరేషన్‌ ఈడీని నియమించాలి

బీసీ కార్పొరేషన్‌కు సంబంధించి తిరుపతి జిల్లాకు ప్రత్యేకంగా ఈడీని నియమించాలి. ఈడీ కార్యాలయం రెండు జిల్లాలకు చిత్తూరులో ఉండడంతో పలువురికి అన్యాయం జరుగుతోంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తయి 3 ఏళ్లు గడుస్తున్నా బీసీ కార్పొరేషన్‌ తిరుపతికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయకపోవడం సరికాదు.

– కట్టా గోపి యాదవ్‌, బీసీ నేత తిరుపతి

వృథాగా విభిన్న ప్రతిభావంతుల కార్యాలయం

విభిన్న ప్రతిభావంతులు జిల్లాలో ఎందరో ఉన్నా రు. కలెక్టరేట్‌లో ప్రత్యేక చాంబర్‌ ఉన్నప్పటికీ చిత్తూరులోనే ప్రధాన కా ర్యాలయం ఉందని చెబుతున్నారు. విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యాలయాన్ని తిరుపతికి మార్పు చేయాలి. – దుడ్డు వేణు, ఎస్సీ సెల్‌ నేత, సత్యవేడు

అన్ని కార్యాలయాలు తిరుపతిలోనే పెట్టాలి

జిల్లాల పునర్విభజనకు మూడేళ్లు పూర్తయింది. అయినా చిత్తూరు నుంచి పలు విభాగాలను పూర్తిగా తిరుపతి జిల్లాకు మార్పు చేయకపోవడం సరికాదు. చిత్తూరు నుంచే అధికారులు రెండు జిల్లాలను పరిపాలించడం ద్వారా తిరుపతి జిల్లా వాసులకు అన్యాయం జరుగుతోంది. కూటమి నేతలు స్పందించి చర్యలు తీసుకోవాలి. – వెంకటేశ్‌, బీసీ నేత

పలు విభాగాల పరిస్థితి అంతే..

ఎస్సీ, బీసీ, మెనారిటీ కార్పొరేషన్ల అధికారం చిత్తూరులో కొనసాగుతోంది. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి సంబంధించి రెండు జిల్లాల అధికారి చిత్తూరులోనే ఉంటున్నారు. కలెక్టరేట్‌లో నామమాత్రంగా ఓ చాంబర్‌ను కేటాయింపు చేశారు. గురుకుల పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి జిల్లా కోఆర్డినేటర్‌ అధికారి (డీసీవో) చిత్తూరులోనే ప్రధాన కార్యాలయం ఉంది. కలెక్టరేట్‌లో నామమాత్రంగా ఓ చాంబర్‌ను కేటాయింపు చేశారు. సివిల్‌ సప్లయ్‌కు సంబంధించి రేషన్‌ డీలర్లుకు ఇటీవల పెద్ద మొత్తంలో తమకు రావాల్సిన కమిషన్లు జారీ ప్రక్రియ మొత్తం చిత్తూరులోని సివిల్‌ సప్లయ్‌ అధికారి వద్దకే తిరుగుతున్నారు. రెవెన్యూ విభాగంలోనూ బదిలీలు, పదోన్నతులు చిత్తూరు కలెక్టర్‌ తిరుపతి జిల్లాకు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఆ తర్వాత తిరుపతి జిల్లా కలెక్టర్‌ వారి మండలాల వారీగా కేటాయింపులు చేస్తున్నారు. జిల్లా పరిషత్‌ అధికారం ఇప్పటికీ చిత్తూరు నుంచే కొనసాగుతోంది. తిరుపతి జిల్లాకు ఏ ఒక్క అధికారి లేరు. ఉన్నతాధికారులు అంతా చిత్తూరులోనే ఉంటున్నారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా వాటి జోలికి వెళ్లకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి.

పేరుకే తిరుపతి జిల్లా.. 1
1/6

పేరుకే తిరుపతి జిల్లా..

పేరుకే తిరుపతి జిల్లా.. 2
2/6

పేరుకే తిరుపతి జిల్లా..

పేరుకే తిరుపతి జిల్లా.. 3
3/6

పేరుకే తిరుపతి జిల్లా..

పేరుకే తిరుపతి జిల్లా.. 4
4/6

పేరుకే తిరుపతి జిల్లా..

పేరుకే తిరుపతి జిల్లా.. 5
5/6

పేరుకే తిరుపతి జిల్లా..

పేరుకే తిరుపతి జిల్లా.. 6
6/6

పేరుకే తిరుపతి జిల్లా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement