
ఎన్టీఆర్ వర్సిటీ వీసీతో ఎస్వీ ప్రిన్సిపల్ బేటి
తిరుపతి తుడా : ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్‌తో ఎస్వీ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవిప్రభు మర్యాద పూర్వకంగా కలిశారు. తిరుపతికి విచ్చేసిన ఆయనను గురువారం ఓ అతిథి గృహంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. ఎస్వీ వైద్య కళాశాల, రుయా ఆసుపత్రి సందర్శనకు రావాల్సిందిగా ఆహ్వానించారు. జులైలో రుయా, వైద్య కళాశాలల్లో పర్యటిస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పినట్లు ప్రిన్సిపల్ రవిప్రభు తెలిపారు. కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధ, ప్రసూతి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారధి రెడ్డి, పీఆర్‌ఓ వీర కిరణ్ పాల్గొన్నారు.
గరుడ వారధిపై తాత్కాలికంగా రాకపోకలు నిషేధం
తిరుపతి తుడా: తిరుపతి నగరంలో నిర్మించిన గరుడ వారధిపై వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నగరపాలక కమిషనర్ మౌర్య తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఏటా పనుల తనిఖీల్లో భాగంగా స్పాన్ లోడ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలో శుక్రవారం నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రామాను జ సర్కిల్ నుంచి శ్రీనివాసం కాంప్లెక్స్ వరకు రాకపోకలను నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని వాహనదారులు, ఆర్టీసీ అధికారులు, నగర ప్రజలు మున్సిపల్ అధికారు లు, ట్రాఫిక్ పోలీసులకు సహరించాలని కోరారు.
వ్యక్తిపై హత్యాయత్నం : అయిదుగురు అరెస్టు
కేవీబీపురం:ఒక వ్యక్తిపై అయిదుగురు కలిసి హత్యాయత్నానికి పాల్పడటంతో పోలీసులు రంగ ప్రవే శం చేసి అరెస్టు చేసిన ఘటన కేవీబీపురం మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేష్ సమాచారం మేరకు ఎంఎ రాజుల కండ్రిగ ఎస్సీ కా లనీలో గ్రామ కంఠం భూమి విషయంలో వచ్చిన తగాదా కారణంతో మునయ్య అనే వ్యక్తిపై అదే కాలనీకిచెందిన బోసు,గిరి, దొరైరాజు, సెల్వ, గోపి అయిదుగురు కలిసి మారణాయుధాలతో దాడి చేయడంతో గాయపడ్డారన్నారు. ఈ మేరకు బాధితుడు శ్రీకాళహస్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడ్డ అయిదుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
పీఎం సహాయ నిధికి
రూ. కోటి విరాళం
తిరుపతి కల్చరల్ : తిరుమల గుబ్బా చౌల్ట్రీ ట్రస్టీ ఒంటేరు శ్రీనివాసులురెడ్డి ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధికి గురువారం కోటి రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ విరాళం చెక్కును విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి చేతులు మీదుగా అందించారు. కార్యక్రమంలో గుబ్బా చౌల్ట్రీ ట్రస్టీలు చెక్కా నాగకుమార్, ఆర్.శ్రీరి, దారా సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.

ఎన్టీఆర్ వర్సిటీ వీసీతో ఎస్వీ ప్రిన్సిపల్ బేటి