
గురుదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2025
శ్రీకాళహస్తీశ్వరాలయంలో మేథోగురుదక్షిణామూర్తికి గురువారం గురుపేచిని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన చేశారు. అనంతరం వినాయక పూజ, కలశ పూజ చేశారు. తరువాత స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతం, చందనం, నారికేళ జలాలతో అభిషేక పూజలు జరిపారు. భక్తులు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, విజయకుమార్ నాయుడు, ప్రధానార్చకులు కరుణాకరన్ గురుకుల్ తదితరులు పాల్గొన్నారు. – శ్రీకాళహస్తి

గురుదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు

గురుదక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు