
నిధుల సేకరణకు యాక్షన్‌ప్లాన్
● స్విమ్స్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో టీటీడీ చైర్మన్
తిరుపతి తుడా : టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రుల నిర్వహణ కోసం నిధులు సేకరణకు యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బుధవారం స్విమ్స్ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్విమ్స్ అభివృద్ధి, మెరుగైన వైద్యసేవలు అందించే విషయంపై టీటీడీ మాజీ ఈఓ ఐవీ సుబ్బారావు అధ్యక్షతన వేసిన ప్రత్యేక ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదికను సమర్పించిందన్నారు. ఆ మేరకు ఖాళీగా ఉన్న 597 వైద్య సిబ్బంది, 434 నర్సులను భర్తీ చేయాల్సి ఉందని వెల్లడించారు. దీంతో స్విమ్స్‌కు ప్రస్తుతం అందిస్తున్న రూ.100 కోట్లకు తోడు అదనంగా రూ.70కోట్ల భారం టీటీడీపై పడుతుందని వివరించారు. టీటీడీ ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ నిధుల సేకరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఎక్స్‌పర్ట్ కమిటీ నివేదికపై జనరల్ కౌన్సిల్‌లో చర్చించామన్నారు. అనంతరం స్విమ్స్ ఆవరణలో నిర్మిస్తున్న క్యాన్సర్ సెంటర్ భవనం పరిశీలించారు. సమావేశంలో ఎక్స్‌పర్ కమిటీ చైర్మన్ ఐవీ సుబ్బారావు, సభ్యులు జేఎస్‌ఎన్ మూర్తి, తేజోమూర్తుల రామోజీ, డాక్టర్ విజయ్ కుమార్, స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీ కుమార్, టీటీడీ బోర్డు మెంబర్లు సుచిత్ర ఎల్లా, సదాశివరావు, జేఈఓ వీరబ్రహ్మం, సీఈ సత్యనారాయణ పాల్గొన్నారు. వర్చువల్‌గా హెల్త్ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, ఎండోమెంట్ సెక్రటరీ వినయ్ చంద్ హాజరయ్యారు.