తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! | - | Sakshi
Sakshi News home page

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

May 12 2025 6:54 AM | Updated on May 12 2025 6:54 AM

తుమ్మ

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

‘తుమ్మలగుంట జోలికొస్తే.. ఐక్యంగా పోరాడతాం.. మా ఊరి అభివృద్ధిపై జరుగుతున్న కుట్రను ఎండగడతాం.. రాజకీయాలకు అతీతంగా గ్రామంలో జరిగిన అభివృద్ధిని ఎవరో వచ్చి చెరిపేస్తాం.. తుడిచేస్తాం.. ఎవరికో అప్పగించేస్తామంటే చూస్తూ ఊరుకోం.. ఎదురు తిరుగుతాం.. అవసరమైతే రోడ్డెక్కుతాం.. ప్రధానంగా కేవీఎస్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ మా గ్రామానికి ఒక మణిహారం.. ఆ స్థలం మాది.. దానిపై హక్కు మాది.. ఇంతకుముందే గ్రామసభలో తీర్మానం చేశాం.. ఇప్పుడు గ్రామమంతా ఏకమై ఒకచోటకు వచ్చింది.. రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న ఏకై క క్రీడామైదానం అది. అలాంటి పార్క్‌ను వేరెవరికో అప్పగిస్తామంటే ఒప్పుకునేది లేదు.. చెవిరెడ్డి కష్టాన్ని వృథా కానీయం..’ అంటూ తుమ్మలగుంట గ్రామస్తులు ముక్త కంఠంతో గర్జించారు.

తిరుపతి రూరల్‌: తుమ్మలగుంట గ్రామంలోని కేవీఎస్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ నిర్వహణ బాధ్యతను పంచాయతీ నుంచి తిరిగి తుడా తీసుకునే ప్రయత్నాలను గ్రామస్తులు వ్యతిరేకించారు. పార్క్‌ను తమ గ్రామం నుంచి ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నారు..? దాని వెనుక కుట్ర ఏమిటి..? వాటిని ఎలా ఎదుర్కోవాలి..? అనే అంశాలపై చర్చించేందుకు గ్రామస్తులు ఆదివారం సాయంత్రం వేలాదిగా తరలివచ్చి ఒక చోట సమావేశమయ్యారు. ఆ సభకు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై కేవీఎస్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ అభివృద్ధికి తాను పడిన కష్టం, ఎదుర్కొన్న విమర్శలను వివరించారు. తల్లివంటి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి జెడ్పీటీసీ సభ్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి నేటి వరకు చేసిన కృషిని క్షుణ్ణంగా తెలియజేశారు. చేయగలిగినంత అభివృద్ధి చేశానని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం గ్రామస్తులకే వదిలేస్తున్నానని చెప్పారు. గతంలో నాలుగేళ్లు కష్టపడి అభివృద్ధి చేసిన ఓ పార్క్‌ను తుడాకు అప్పగిస్తే నాలుగు నెలలకే నాశనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ చెవిరెడ్డి చేసిన అభివృద్ధిని ఎట్టి పరిస్థితుల్లో గ్రామ పొలిమేర దాటనీయమని, అందుకోసం ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అందరూ ఒక్కటై అడ్డుకుంటామని వెల్లడించారు. ఈ అంశంపై ఎవ్వరు ఏమన్నారంటే...

మా ఊరి జోలికి రావద్దు

మా ఊరి జోలికి ఎవరూ రావద్దండి.. మా గ్రామంలోని కేవీఎస్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ను ఎంతో మంది మెచ్చుకుంటున్నారు. ఇంత అ ద్భుతంగా తయారు చేయడం ఎవరికీ సాధ్యం కా దని చెప్పడం చూస్తుంటే మాకు ఆనందంగా ఉంటుంది. అంతలా కష్టపడిన చెవిరెడ్డిని మా గ్రా మం ఎన్నటికీ మరవదు. రాజకీయాలు మాకు అవసరం లేదు. ఎవరైనా సరే గ్రామంలో అభివృద్ధి చేయాలే తప్ప చేసిన పనులు దూరం చేస్తామంటే కుదరదు.

– బుజ్జమ్మ, ఎంపీటీసీ సభ్యులు, తుమ్మలగుంట

ఎంత దూరమైనా వెళతాం

తుమ్మలగుంట గ్రామస్తుల ఐక్య త ఎలా ఉంటుందో చూపిస్తాం. అభివృద్ధిని కాపాడుకోవడంలో ఎంత దూరమైనా వెళతాం. మా గ్రామం జోలికి వస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదు. మా గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. అది మాకు గర్వకారణం. ఆయన చేసిన అభివృద్ధిని దూరం చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. మా గ్రామ చరిత్రలో చెవిరెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. – గోవిందరెడ్డి, మాజీ ఉపసర్పంచ్‌, తుమ్మలగుంట

అభివృద్ధిని తుడిచేయాలంటే అడ్డుకుంటాం

తిరుపతి నగరం కంటే తుమ్మలగుంటలో నివాసముండాలని ఎంతో మంది విశ్రాంత ఉద్యోగులు మా గ్రామానికి వస్తున్నారు. చెవిరెడ్డి అద్భుతంగా తయారు చేసిన అభివృద్ధి పనులతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. అలాంటి అభివృద్ధిని తుడిచేయాలని చూస్తే అడ్డుకుంటాం. చెవిరెడ్డి చేసిన అభివృద్ధిలో ప్రధానమైనది కేవీఎస్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ ఒకటి. ఆ పార్క్‌ను మా పంచాయతీకి దూరం చేస్తామంటే ఎలా ఊరుకుంటాం.. – గీతమ్మ, తుమ్మలగుంట నివాసి

తుడాకు ఏం సంబంధం

తుమ్మలగుంట గ్రామానికి కేవీఎస్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ ఒక మణిహారం. ఆ పార్క్‌ నిర్మాణం జరిగింది మా గ్రామానికి చెందిన భూమిలోనే. ప్రజలు తుడాకు కట్టిన పన్నులతో అభివృద్ధి చేశారు. ప్రభుత్వం నుంచి తుడాకు వచ్చిన నిధులు ఏమీ లేదు కదా..? మా గ్రామస్తులే కాదు ఈ విషయంలో ఎంతటి వారినైనా ఎదుర్కొంటాం.

– సుబ్బరామిరెడ్డి, సర్పంచ్‌, తుమ్మలగుంట

సమష్టిగా పోరాడతాం

తుమ్మలగుంట అభివృద్ధిలో రాజకీయ కక్షలు వద్దు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. గెలిచిన వారికి చేతనైతే మా గ్రామమంలో మరింత అభివృద్ధి పనులు చేయాలి. చేసిన వాటిని పంచాయతీకి దూరం చేస్తామంటే ఒప్పుకోం. అడ్డుకునేందుకు సమష్టిగా పోరాడతాం.

– రామచంద్రారెడ్డి,

మాజీ సర్పంచ్‌, తుమ్మలగుంట

గతంలో మోసపోయాం

గతంలో మా గ్రామం నుంచి ఒక పార్క్‌ను తుడా నిర్వహిస్తామంటే అప్పగించాం. నాలుగు నెలలకే సర్వనాశనం చేసేశారు. పార్క్‌ల నిర్వహణ తుడాకు కష్టమని తెలిసినా రాజకీయ కక్షలతో ఆహ్లాదకరమైన కేవీఎస్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ను పంచాయతీ నుంచి దూరం చేయాలని చూస్తున్నారు.

– జయచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌, తుమ్మలగుంట

నాశనం చేస్తామంటే ఒప్పుకోం

జాతీయ స్థాయి ఆటల పోటీలు నిర్వహించేందుకు క్రీడాకారులకు అనువైన పార్క్‌ మా గ్రామంలో ఉందంటే అది మాకు గర్వకారణం. అలాంటి పార్క్‌ను మాకు దూరం చేస్తాం, నాశనం చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు.అభివృద్ధి పనులను దూరం చేస్తామంటే ఎవరూ ఒప్పుకోరు. మా ఊరు జోలికి వస్తే ఎవరినీ వదలం.

– గోపాల్‌రెడ్డి, ఉపసర్పంచ్‌, తుమ్మలగుంట

తమాషాగా ఉందా?

తుమ్మలగుంట అంటే తమాషా గా ఉందా..? మా ఊరు జోలికి వస్తే ఎవరూ వదలరు.. మా గ్రామ అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఇదంతా చేస్తున్నారు. కేవీఎస్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ వల్ల మా గ్రామం ఎంతలా అభివృద్ధి చెందిందో దేశ మంతా తెలుసు. ఆ పార్క్‌ను ఎవరికో ఇచ్చేస్తామంటే ఒప్పుకుంటామా..? ఎవరినైనా ఎదిరిస్తాం.. ఎంతవరకై నా పోరాడతాం. – రత్నమ్మ,

జెడ్పీటీసీ సభ్యులు, తిరుపతి రూరల్‌

ఐక్యంగా ఎవరినైనా ఎదిరిస్తాం వృథా కాదు.. చెవిరెడ్డి కష్టం ఒకే వేదికపై ముక్త కంఠంతో

గర్జించిన గ్రామస్తులు

భూమి మాది.. హక్కు మాది

తుమ్మలగుంటలో ఏర్పాటు చేసిన గోవిందధామం అయి నా.. కేవీఎస్‌ స్పోర్ట్స్‌ పార్క్‌ అయినా వాటికి కేటాయించిన భూమి మా గ్రామానికి చెందింది. దానిపై హక్కు మా ఊరి ప్రజలకే ఉంటుంది. అక్కడ జరిగిన అభివృద్ధిని ఎవరికో అప్పగించేస్తాం.. నాశనం చేసేస్తామంటే చూస్తూ ఊరుకోం. గ్రామంలో ప్రజలందరం ఏకమై పోరాడతాం. – దామోదర్‌రెడ్డి,

మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 1
1/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 2
2/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 3
3/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 4
4/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 5
5/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 6
6/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 7
7/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 8
8/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 9
9/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 10
10/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 11
11/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 12
12/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా! 13
13/13

తుమ్మలగుంట జోలికొస్తే..ఎందాకై నా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement