● అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు రాజగోపాలరావు
తిరుపతి కల్చరల్: పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రలయ్యారని, అలాంటి మోట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకుడు రాజగోపాలరావు ఉద్ఘాటించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతి మహోత్సవంలో భాగంగా మంగళవారం తొలిరోజు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వేడుకగా నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థచార్యులు, అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 700 మందికిపైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.