తిరుమల : తిరుమలలోని పార్కింగ్ చేసిన ఉన్న కార్ల అద్దాలు పగులకొట్టి చోరీలకు పాల్పడే ఘరానా నేరస్తుడిని సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ శ్రీరాముడు తెలిపారు. తిరుమల టూటౌన్ సీఐ కథనం మేరకు.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన కే. హేమచంద్రారెడ్డి(35) పాతనేరస్తుడు. ఇతను తిరుమలకు వచ్చి పార్కింగ్ చేసిన కార్ల అద్దాలు పగులకొట్టి కార్ల ఉన్న లగేజీతోపాటు విలువైన నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను చోరీ చేసేవాడు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ.60 వేలు నగదు, ఒక జత బంగారు కమ్మలు, కారు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శ్రీరాముడు తెలిపారు.