తిరుపతి తుడా: ఎస్వీ వైద్య కళాశాల ప్రాంగణం పల్మనాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం ర్యాలీ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్వీ వైద్య కళా శాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీహరిరావు, జిల్లా టీబీ ప్రో గ్రామ్ అధికారి డాక్టర్ శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏడాది కాలంగా టీబీ వ్యాధి నివారణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన సిబ్బందికి, టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో ఎంపికై పంచాయతీలకు అతిథుల చేతుల మీదుగా అవార్డులు, బహుమతులు ప్రదా నం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవిరాజు, డాక్టర్ ప్రేమనంద, డాక్టర్ ఆర్‌ఆర్ రెడ్డి, డాక్టర్ అజయ్, వైద్యులు భరత్, అనుపమ, ఉదయ్ పాల్గొన్నారు.