నాయుడుపేట టౌన్ : పొలాల్లోకి వెళ్లేందుకు వీలు గా సాగరమాల జాతీయ రహదారిలో అండర్ పాస్ బ్రిడ్జిలు, సర్వీసు రోడ్లు వేయాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. వారు సోమవారం చిలమత్తూరు సమీపంలో సాగరమాల రోడ్డు పనులను అడ్డుకుని ధర్నా చేశారు. రైతు సంఘం నాయకులు వాకాటి సుధాకర్ రెడ్డి, సన్నారెడ్డి హరినాథ్‌రెడ్డి, జలదంకి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడారు. భూసేకరణ సమయంలో రైతులకు ఇబ్బంది లేకుండా సర్వీ సు రోడ్లు వేస్తామని కలెక్టర్, సూళ్లూరుపేట ఆర్డీవో, తహసీల్దార్ హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు పొలాల మధ్య సుమారు 13 అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. రెండు వైపులా పొలాలున్న రైతులు పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొందని వివరించారు. నాయుడుపేట మండలంలోనే సుమారు 4 వేల ఎకరాల భూముల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయిందని తెలిపారు. రోడ్డు నిర్మాణంపై తిరుపతి ఎంపీ గురుమూర్తి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతోపాటు సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులకు రిజిస్టర్ పోస్టులో వినతి పత్రాలు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో కామిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జలదంకి ధనుంజయ రెడ్డి, కాపులూరు చంద్రమోహన్, చమతా రాజేష్, చిలమత్తూరు రత్నయ్య, ఎం వెంకయ్య, వెంకట రమణయ్య, శ్యామ్‌కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిల్లకూరు : తమ గ్రామాలకు వెళ్లేందుకు వీలుగా సాగరమాల రోడ్డు నుంచి సర్వీసు రోడ్లు వేయాలని పారిచర్లవారిపాళెం, తిప్పగుంటపాళెం, చేడిమాల, ఉడతావారిపార్లపల్లి, అంకులపాటూరు, బల్లవో లు, కాకువారిపాళెం ప్రజలు డిమాండ్ చేశారు. వా రు సోమవారం తమ గ్రామాల వద్ద నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ మండలంలో వరగలి క్రాస్ రోడ్డు నుంచి తూర్పుకనుపూరు వరకు సాగరమాల రోడ్డు వేస్తున్నట్టు తెలిపారు.
పలు గ్రామాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లు వేయడం లేదన్నారు. మూడు కిలోమీటర్లు తిరిగి తమ గ్రామాలకు చేరు కోవాల్సి వస్తోందని వాపోయారు. సమస్యను కాంట్రాక్టు సంస్థకు తెలిపితే తమకు సబంధం లేదని తెగేసి చెప్పారని విమర్శించారు. ఈ విషయాన్ని తిరుపతి ఎంపీ గురుమూర్తి దృష్టికి తీసుకెళ్లామని తె లిపారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం చొరవ తీ సుకుని సర్వీసు రోడ్లు వేయాలని కోరారు. ఈ వి షయం తెలుసుకున్న ఎంపీ గురుమూర్తి కేంద్ర మంత్రి గడ్కరి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు పోన్‌లో తెలిపారు.