శ్రీకాళహస్తి: తిరుపతి రూరల్ పరిధిలో ఆక్రమణకు గురవుతున్న ఓటేరు చెరువు పంచాయితీ మంత్రి లోకేష్ వద్దకు చేరింది. శుక్రవారం శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు మంత్రి లోకేష్‌ను కలిసి ఓటేరు చెరువు గురించి ప్రస్తావించినట్లు సమాచారం. గత వారంలో ఎస్సీవీ నాయుడు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి మధ్య ఓటేరు చెరువు విషయమై వివాదం నెలకొంది. అది చెరువు భూమి కాదని ఎస్సీవీ నాయుడు, చెరువులను రక్షించాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి బాహాబాహికి దిగారు. దీంతో టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.