
కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు
తిరుపతి అర్బన్: కలెక్టర్ కార్యాలయంలోనే బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు శుక్రవారం ఈ మెయిల్ పంపించారు. వెంటనే స్పందించిన ఏఎస్పీ రవి మనోహరాచారి నేతృత్వంలో తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్, ఎస్‌ఐలు కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌లో వంద మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్న నేపథ్యంలో వారంతా ఆందోళన చెందకుండా సాదారణ తనిఖీల్లో భాగంగానే వచ్చామంటూ ఏబ్లాక్, బీ బ్లాక్‌తోపాటు అన్ని గదులను, టాయిలెట్స్‌ను, దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఎక్కడా ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తమకు వచ్చిన ఈ మెయిల్ ఫేక్‌గా భావించారు. శుక్రవారం సాయంత్రం 4.30– 4.45 గంటల మధ్య పోలీసులకు ఈ మెయిల్ రావడంతో 5.15 గంటలకే కలెక్టరేట్‌కు చేరుకున్న పోలీసులు సాయంత్రం 6.45 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు ఈ మెయిల్...
అప్రమత్తమైన ఏఎస్పీ
తిరుచానూరు పోలీసులతో గాలింపు
హోటల్స్ నుంచి కలెక్టరేట్‌కు పాకిన బాంబు బెదిరింపులు
సాయంత్రం 4.30 – 4.45 గంటల మధ్యలో పోలీసులకు మెయిల్
5.15 గంటల నుంచి6.45 గంటల వరకు తనిఖీలు