
పశువులకు వడదెబ్బ ముప్పు
జిల్లా సమాచారం
సైదాపురం: వేసవిలో పశువులను నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. దీనికారణంగా పాల దిగుబడి తగ్గుముఖం పడుతుంది. మరికొన్ని మృత్యువాత పడుతాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే పాడిపశువులను కాపాడుకోవచ్చు అని సైదాపురం మండల పశువైద్యాధికారి బొడ్డు ప్రసాద్ సూచించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే..
వడ దెబ్బకు శరీర ప్రక్రియ మందగిస్తుంది
వేసవిలో పశువుల శరీర ఉష్ణోగ్రతకంటే బయటి ఉష్ణోగ్రత అధికమైనప్పుడు మెదడులోని హైపోదలామస్ స్వేద గ్రంధుల నిర్వాహణపై పర్యవేక్షణ కోల్పోతాయి. చెమట ద్వారా శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి శరీర ప్రక్రియ మందగిస్తుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శ్వాస, గుండె, నాడీ వేగం పెరుగుతుంది. మూత్ర పిండాలు సరిగా పనిచేయవు. దీంతో పశువులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి శ్వాస ఆడక మరణించే ప్రమాదం ఉంది.
నివారణ చర్యలు
వేసవిలో పశువులను మేతకు వదలరాదు. ఉదయం, సాయంత్ర చల్లగా ఉన్నప్పుడు మాత్రమే పశువులను బయటకు తోలాలి. పశువులను రోజుకు మూడునాలుగు సార్లు చల్లటి నీటితో కడగాలి. నాటు జాతి పశువుల కంటే సంకరజాతి ఆవులు, గేదెలు త్వరగా వడదె దెబ్బకు గురవుతాయి. రేకుల కప్పులు ఉన్న పశువుల షెడ్లుపై గడ్డిని కప్పి మధ్యాహ్న వేళ్లలో నీళ్లను చల్లుతుండాలి. వడ గాలుల ప్రభావం పడకుండా గోనె సంచి పరదాలను ఏర్పాటు చేసుకోవాలి.
చికిత్స విధానం
వడదెబ్బకు గురైన పశువులను వెంటనే చల్లని గాలి వీచే ప్రదేశానికి మార్చాలి. పశువుల శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకోవడానికి పలుమార్లు చల్లటి నీటితో కడగాలి. ఆ తర్వాత పశువైద్యాధికారులను సంప్రందించాలి. వేడిని తగ్గించే ఇంజెక్షన్ వేయాలి. రక్తంలో డెక్ట్రోజ్‌సైలెన్ ఎక్కించడం వల్ల శరీరానికి సరిపడా గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ అంది పశువులు నీరసం నుంచి బయటపడుతాయి.
డివిజన్ ఆవులు గేదెలు
గూడూరు 30517 1.27.462
శ్రీకాళహస్తి 83433 46.205
తిరుపతి 1.04.319 11.334
సూళ్లూరుపేట 41.479 1.08.740
మొత్తం 2,59,748 2,93,741
పాలదిగుబడిపై ప్రభావం చూపే అవకాశం
అప్రమత్తంగా ఉండాలంటున్న పశువైద్యాధికారులు
వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ తగిలిన పశువులు శరీర ఉష్ణోగ్రత 103 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. చర్మం గట్టిపడుతుంది. నోటి వెంట సొంగ కారుతుంది. నీడ కోసం చెట్టుకింద చేరి కూలబడుతాయి. శ్వాస పీల్చడం కష్టమవుతుంది. పశువులు క్రమంగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణిస్తాయి. శరీర ఉష్ణోగ్రత 103 నుంచి 109 డిగ్రీల దాటితే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ ప్రభావంతో చూడి పశువుల్లో గర్భస్రావం సంభవిస్తుంది. దూడలు అతిసార వ్యాధితో మృత్యువాత పడుతాయి.

పశువులకు వడదెబ్బ ముప్పు

పశువులకు వడదెబ్బ ముప్పు