తిరుపతి మంగళం : ఎర్రచందనం పరిరక్షణకు అహర్నిశలు శ్రమిస్తున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలంటే ఆరోగ్యం ముఖ్యమని టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బరాయుడు అన్నారు. తిరుపతి కపిలితీర్థం సమీపంలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో గురువారం ఎరచ్రందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న సిబ్బందికి టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు, ఎస్పీ పి.శ్రీనివాస్ మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లే సిబ్బంది పలు కారణాలతో గాయపడుతుంటారన్నారు. ఈ నేపథ్యంలో టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఫస్ట్ ఎయిడ్‌తోపాటు మెడికల్ కిట్లను తెప్పించి పంపిణీ చేశారన్నారు. మెడికల్ కిట్‌లో టాబ్లెట్‌లు,ఓఆర్‌ఎస్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, మోకాలి కేప్‌లు, బెల్టులు, పెయిన్ జెల్‌లు, సర్జికల్ డ్రెస్సింగ్ బ్యాండేజీలతోపాటు 15 రకాల మందులను అందజేశామన్నారు. టాస్క్‌ఫోర్స్ డిఎస్పీలు జె.బాలిరెడ్డి, వీ.శ్రీనివాసులురెడ్డి, ఎండీ షరీఫ్, ఆర్‌ఐ సాయి గిరిధర్, సీఐ సురేష్ కుమార్, ఎస్‌ఐ రఫీ, ఏసీఎఫ్ జె.శ్రీనివాస్, ఎఫ్‌ఆర్‌ఓ మురళీకృష్ణ పాల్గొన్నారు.