తిరుపతి సిటీ : ఎస్వీయూ మహిళా అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మహిళలకు సాంకేతికత, డిజిటల్ భద్రతలో రక్షణ, నివారణ చర్యలు అనే అంశంపై ఒక్కరోజు వర్క్‌షాపు నిర్వహించారు. వర్సిటీ ఆర్ట్స్ కళాశాల అధ్యక్షురాలు ఆచార్య సుధారాణి మాట్లాడుతూ సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా మహిళలు యాప్‌ల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కెమెరాలున్న సాంకేతిక వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విభాగాధిపతి ఆచార్య సాయి సుజాత, విద్యార్థినులు, మహిళా పరిశోధకులు పాల్గొన్నారు.