●
ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
నేను ఎకరా పొలంలో మిర్చి సాగు చేశా. మొదట్లో ధరలు బాగా ఉండడంతో ఆదాయం బాగా వస్తుందని అనుకున్నా. దీంతో ఎకరాకు రూ.2లక్షల వరకు ఖర్చు చేశా. దిగుబడి వచ్చే సమయానికి మిర్చి ధరలు పతానావస్థకు చేరుకున్నాయి. గత ఏడాది టన్ను మిర్చి రూ.30వేల వరకు పలికింది.ప్రస్తుతం టన్ను రూ.15వేలు మాత్రమే ఉంది. ధరలు సగానికి పైగా పడిపోవడంతో ఎకరాకు రూ.లక్ష వరకు నష్టం వచ్చింది. మార్కెట్‌లో మాత్రం మిర్చి ధర ఆకాశాన్నంటుతోంది. మాకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణం. – రమణయ్య,
మిర్చి రైతు, తిన్నెలపూడి, కోట మండలం
● పంటలకు దక్కని గిట్టుబాటు ● పెట్టుబడి కూడా ప్రశ్నార్థక