ప్రవేశాలను పెంచుకోవడం చేతగాకనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, తమిళ్, ఉమెన్ స్టడీస్ వంటి కోర్సులకు చరమగీతం పాడుతూ మరిన్ని కోర్సులను మెడ్జ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే జరిగితే విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏడీ బిల్డింగ్‌ను ముట్టడిస్తాం. – ఎస్.చిన్న, ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి, తిరుపతి
స్వతహాగా పీజీసెట్ బెటర్
వర్సిటీ అభివృద్ధి పథంలో నడవాలంటే కోర్సులను తొలగించడం కాదు. ప్రవేశాలను ప్రొత్సహించి, స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇవ్వాలి. ఉపాధి, ఉద్యోగావకాశాలను పెంచే ప్రయత్నం జరగాలి. కామన్ పీజీసెట్‌ను రద్దు చేసి, వర్సిటీ స్వతహాగా పీజీసెట్ నిర్వహిస్తే అడ్మిషన్లు పెరుగుతాయి. – భగవత్ రవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, తిరుపతి
ప్రవేశాలను పెంచడం చేతగాకే...