31 నుంచి యాదాద్రిలో బ్రేక్‌ దర్శనాలు | Yadadri Temple To Introduce Break Darshan From October 31 | Sakshi
Sakshi News home page

31 నుంచి యాదాద్రిలో బ్రేక్‌ దర్శనాలు

Oct 30 2022 2:29 AM | Updated on Oct 30 2022 2:29 AM

Yadadri Temple To Introduce Break Darshan From October 31 - Sakshi

బ్రేక్‌ దర్శనాలకు భక్తులను పంపించే  ఉత్తర రాజగోపురం ఇదే  

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు, వీఐపీ, వీవీఐపీలకు తిరుపతి తరహాలో దర్శనాలు కల్పించేలా ఆలయ అధికా రులు చర్యలు చేపట్టారు. ఈ నెల 31 నుంచి బ్రేక్‌ దర్శనాలను అమలు చేయనున్నట్లు ఈవో గీతారెడ్డి శనివారం వెల్లడించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలు కల్పించనున్నారు.

బ్రేక్‌ దర్శనానికి ఒక్కొక్కరికీ టికెట్‌ ధర రూ.300గా నిర్ణయించారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మొదటి దశలో 200, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కొనసాగే బ్రేక్‌ దర్శనాలకు 200 టికెట్లు మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ బ్రేక్‌ దర్శనం టికెట్‌ కొనుగోలు చేసి ఆయా సమయాల్లో వచ్చిన భక్తులను ఉత్తర రాజగోపురం నుంచి శ్రీస్వామి వారి దర్శనాలకు పంపించనున్నారు. 

ధర్మ దర్శనం, ప్రత్యేక దర్శనాల నిలుపుదల..
బ్రేక్‌ దర్శనాలు ఉన్న ఆయా సమయాల్లో ధర్మదర్శ నాలు, ప్రత్యేక దర్శనాలను నిలిపివేయనున్నారు. బ్రేక్‌ దర్శనాల కోసం సిఫారసు లేఖలు తీసుకువచ్చే భక్తులు కొండపైన రిసెప్షన్‌ కార్యాలయం (పీఆర్‌వో)లో ఇచ్చి, అక్కడే రూ.300 టికెట్‌ కొనుగోలు చేసి ఉత్తర రాజగోపురం వద్దకు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement