'సెల్‌-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి... | Xiaomi 14 CV Model Unveiled | Sakshi
Sakshi News home page

'సెల్‌-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి...

Jun 21 2024 1:05 PM | Updated on Jun 21 2024 1:05 PM

Xiaomi 14 CV Model Unveiled

సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ టాలీవుడ్‌ నటి, యాంకర్‌ వర్షిణి గచ్చిబౌలిలోని సెల్‌ బే స్టోర్‌ వేదికగా సందడి చేశారు. షావోమీ ఆధ్వర్యంలోని సరికొత్త 5జీ హ్యాండ్సెట్‌ షావోమీ 14 సీవీ మోడల్‌ను నటి వర్షణి గురువారం ఆవిష్కరించారు.

ఎప్పటికప్పుడు మారిపోతున్న సాంకేతికత అధునాతన జివన విధానానికి చేరువ చేస్తుందని ఆమె అన్నారు. వినూత్న ఫీచర్స్‌తో రూపొందించిన ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించడం సంతోషమన్నారు. తెలంగాణ కస్టమర్లకు అధునాతన ఉత్పత్తులను అందించడంలో తమ సంస్థ ముందుంటుందని సెల్‌ బే వ్యవస్థాపకులు, ఎండీ సోమా నాగరాజు పేర్కొన్నారు.

ఇండియా డిప్యూటీ హెడ్‌ కునాల్‌ అగర్వాల్, ఛానల్‌ సేల్స్‌ డైరెక్టర్‌ మల్లికార్జున రావు, ట్రేడ్‌ ఛానల్‌ హెడ్‌ సాజు రత్నం, జోనల్‌ హెడ్‌ సయ్యద్‌ అన్వర్, నేషనల్‌ రిటైల్‌ ఎండీ మొహమ్మద్‌ ఇఫ్తేకర్‌ పాల్గొన్నారు.

ఇవి చదవండి: బే విండోకు.. డిజైన్‌ ఎక్స్‌లెన్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement