2026లో ప్రపంచంలో ఆయిల్, గ్యాస్‌ కొరతే | Will 2026 Become an Oil and Gas Shortage Year: Telangana | Sakshi
Sakshi News home page

2026లో ప్రపంచంలో ఆయిల్, గ్యాస్‌ కొరతే

Apr 7 2026 4:32 AM | Updated on Apr 7 2026 4:33 AM

Will 2026 Become an Oil and Gas Shortage Year: Telangana

ట్రంప్‌ హెచ్చరికలకు అక్షరాలా అర్థం ఇదే.. ‘ఎక్స్‌’లో హైదరాబాద్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షు­డు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన హెచ్చరికలపై హైదరాబాద్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ తీవ్రంగా స్పందించింది. ‘మంగళవారం పవర్‌ప్లాంట్‌ డే’ అని ట్రంప్‌ చేసిన హెచ్చరికకి అక్షరాలా అర్థం.. ‘బుధవారం పశ్చిమాసియాలో విద్యుత్‌ సర­ఫ­రా స్తంభించిపోతుంది, 2026లో ప్రపంచంలో ఆయిల్, గ్యాస్‌ కొరత నెలకొంటుంది’ అనేనని సా­మాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా సోమ­వా­రం పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. విశ్వ­శాంతి, ఇంధన భద్రతకు ట్రంప్‌ ముప్పుగా పరి­ణమించాడని విమర్శించింది.

అమెరికా, ఇజ్రా­యెల్‌ దేశాలు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపి­స్తుండగా, ఇరాన్‌ పశ్చిమాసియా దేశాల్లోని అ­మె­రికా సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్‌ క్షిపణులతో ప్రతిదాడులు చేస్తున్న విషయం తెలిసిందే. హార్మూజ్‌ జలసంధిని సోమవారంలోగా తెరవకుంటే నరకానికి పంపి­స్తానని ఆదివారం ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్‌.. మంగళవారం మరో అడుగు ముందుకేసి ఆ దేశంలోని విద్యుత్‌ కేంద్రాలు, వంతెనలతో పాటు ఇతరత్రా అన్నింటిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. దీనికి ఇరాన్‌ కాన్సులేట్‌ స్పందిస్తూ పశ్చిమాసియా దేశాల్లోని విద్యుత్‌ కేంద్రాలతో పాటు చమురు కేంద్రాలపై ప్రతిదాడులకు దిగుతామని పరోక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement