
ప్రమాదంలో భార్య మృతి
మనస్తాపంతో యాసిడ్ తాగి భర్త మృతి
కామారెడ్డి(జుక్కల్): రోడ్డు ప్రమాదంలో భార్య మరణా న్ని తట్టుకోలేకపోయిన ఒక భర్త తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగి మరణించాడు. వివరాలివి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సునీల్‌కు, పెద్దతడ్గూర్ గ్రామానికి చెందిన జ్యోతితో గతేడాది పెళ్లి జరిగింది. ప్రస్తుతం జ్యోతి ఆరు నెలల గర్భవతి. శుక్రవారం భార్యాభర్తలు కలిసి బైక్‌పై వెళ్తుండగా.. బిచ్కుంద శివారులోని మైసమ్మ గుడి వద్ద అదుపు తప్పి పడిపోయారు.
ఈ ప్రమాదంలో జ్యోతి (22) తలకు తీవ్రగాయాలై మృతి చెందింది. మృతదేహాన్ని అంబులెన్స్‌లో బిచ్కుందలోని ఇంటికి తీసుకొచ్చారు. శవాన్ని దించిన కొద్దిసేపటికే.. సునీల్ (26) తీవ్ర మనస్తాపంతో యాసిడ్ తాగాడు. బంధువులు అదే అంబులెన్స్‌లో సునీల్‌ను ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి సు నీల్ మృతి చెందాడు. భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, తమకు సంతా నం కలగబోతోందని సంతోషపడేవారని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.