ప్రేమించి పెళ్లిచేసుకుని.. భర్త అకాల మరణం.. భార్య బలవన్మరణం

Wife And Husband Deceased Within 15 Days At Medak District - Sakshi

15 రోజుల వ్యవధిలో దంపతుల మృతి 

అనాథలైన పిల్లలు 

సాక్షి, చిన్నశంకరంపేట్‌(మెదక్‌): ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త అకాల మరణాన్ని తట్టుకోలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. నీ వెంటే నేనంటూ భర్త చనిపోయిన రెండు వారాలకే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గౌస్‌ వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల మహేశ్వరి (25) భర్త రమేష్‌ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో రమేష్‌ ఈ నెల 6న మృతిచెందాడు.

ఈ క్రమంలో మానసిక వేదనకు గురైన మహేశ్వరి ఆదివారం తెల్లవారుజామున పాతచెరువులో దూకింది. స్థానికులు గమనించి రక్షించడానికి ప్రయత్నించగా, అప్పటికే నీటిలో మునిగి మృతిచెందింది. మృతురాలి తండ్రి మల్లేశం ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 15రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరు చనిపోవడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. వీరి మృతితో పిల్లలు అనాథలయ్యారు. 

 చదవండి: (హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top