Vaccination:మద్యం అమ్మకందారులకు ప్రాధాన్యత

Vaccination TS Govt Decides To Give Vaccine To Liquor Shop Owners - Sakshi

లిక్కర్‌ షాప్‌ యజమానులను సూపర్‌ స్ప్రెడర్స్‌గా గుర్తించిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించింది. అయినా మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనాలు ఎక్కువగా చేరే లిక్కర్‌ షాప్‌ నిర్వాహకులను సూపర్‌ స్ప్రెడర్స్‌గా గుర్తించింది ప్రభుత్వం. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ డ్రైవ్‌లో మద్యం అమ్మకందారులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. 

అలానే ఎల్‌పీజీ సిలిండర్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో-క్యాబ్‌ డ్రైవర్లకు,రైతుబజార్లు, కూరగాయలు, నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్వాహకులకు, పాలు, దుకాణదారులకు ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా త్వరగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

చదవండి: వ్యాక్సిన్ పాలసీని సిద్ధం చేసిన తెలంగాణ సర్కార్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top