టెట్‌ అభ్యర్థులకు తీపి కబురు... ఆ పోస్టులకు అర్హులే!

Tstet Candidates Also Eligible For Ekalavya Model School Examination - Sakshi

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న ఏక లవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో (ఈఎం ఆర్‌ఎస్‌) ప్రిన్సిపాల్, వైస్‌ ప్రిన్సిపాల్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యు యేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టుల భర్తీకి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 3,400 పోస్టుల భర్తీకి ఈ నోటి ఫికేషన్‌ను జారీ చేయగా, అందులో తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్‌ స్కూళ్లలో 262 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో 168 టీజీటీ పోస్టులు ఉండగా, ఆయా పోస్టు లకు సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టులో (సీటెట్‌) అర్హత సాధించిన వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టెట్‌లోనూ అర్హత సాధించిన అభ్యర్థులు కూడా అర్హులేనని స్పష్టం చేసింది.

50 శాతం మార్కులతో డిగ్రీ, టెట్‌లో అర్హత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. అలాగే 11 ప్రిన్సిపాల్‌ పోస్టులు, 6 వైస్‌ ప్రిన్సిపాల్‌ పోస్టులు, 77 పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా పోస్టులకు సంబంధించిన అర్హతల వివరాలను తమ వెబ్‌సైట్‌లో (https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/Page/Page?PageId=5)పొందొచ్చని వివరించింది. మెుత్తంగా రాష్ట్రంలోని 262 పోస్టుల భర్తీకి గురువారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిన ఎన్‌టీఏ.. అభ్యర్థులు ఈనెల 30 వరకు nhttps://recruitment.nta.nic.in  వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆన్‌లైన్‌ పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుందని తెలిపింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top