TSPSC: 40 లక్షలకు మూడు ఏఈ పేపర్లు లీక్‌.. కేసులో సినిమా రేంజ్‌ ట్విస్ట్‌

TSPSC Accused Leaking Three AE Papers For 40 Lakhs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్‌ ఇప్పటికే స్పీడ్‌ పెంచింది. కాగా, తాజాగా టీఎస్‌పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్‌ లీక్‌లో కేతావత్‌ రాజేశ్వర్‌ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. 

అయితే, మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్‌ రూ.40 లక్షలకు అమ్మినట్టు విచారణలో తేలింది. ఇందుకు రూ. 25 లక్షలను రాజేశ్‌ అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బును పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుల నుంచి పోలీసులు.. రూ. 8.5 లక్షలను రికవరీ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్‌ కుమార్‌.. రేణుకకు పేపర్‌ లీక్‌ చేశాడు. నమ్మకమైన వారికి పేపర్‌ అమ్మాలని రేణుకకు సూచించాడు. ఈ సందర్బంగా రూ. 10లక్షలకు రేణుకతో బేరం కుదుర్చుకున్నాడు. దీంతో, రేణుక వద్ద నుంచి ప్రవీణ్‌ అడ్వాన్స్‌గా రూ. 5లక్షలు తీసుకున్నాడు. 

ఇక, ఈ పేపర్లను రేణుక తన భర్త డాక్యానాయక్‌ ద్వారా అమ్మకానికి పెట్టింది. వారి సమీప బంధువైన రాజేశ్వర్‌కు పేపర్‌ విషయం చెప్పి అమ్మాలని సూచించారు. రంగంలోకి దిగిన రాజేశ్వర్‌.. మధ్యవర్తులు గోపాల్‌, నీలేష్‌, ప్రశాంత్‌, రాజేంద్రకుమార్‌లకు రూ. 40 లక్షలకు పేపర్లను విక్రయించాడు. వారి వద్ద నుంచి అడ్వాన్స్‌గా రూ. 23 లక్షలు తీసుకున్నాడు. అనంతరం, రూ.10లక్షలు డాక్యానాయక్‌కు ఇచ్చిన రాజేశ్వర్‌. ఇక, ఇందులో నుంచి మరో రూ.5లక్షలను ప్రవీణ్‌కు డాక్యా నాయక్‌ ఇచ్చాడు. 

అయితే, రాజేశ్వర్‌ తల్లి గండీడ్‌(మండలం) మన్సూర్‌పల్లి తండా సర్పంచ్‌. పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో రూ. 8లక్షలు వెచ్చించి ఊరిలో రాజేశ్వర్‌ అభివృద్ధి పనులు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక రూ.8లక్షలు తీసుకుందామని రాజేశ్వర్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top