గురుకుల పరీక్షల తుది ‘కీ’లు ఖరారు | TREIRB Gurukul Final Key 2023 | Sakshi
Sakshi News home page

గురుకుల పరీక్షల తుది ‘కీ’లు ఖరారు

Sep 6 2023 5:15 AM | Updated on Sep 6 2023 5:15 AM

TREIRB Gurukul Final Key 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత నెలలో నిర్వహించిన అర్హత పరీక్షల తుది ‘కీ’లను గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఖరారు చేసింది. ఆగస్టు చివరి వారంలో ప్రాథమిక కీలను అందుబాటులోకి తీసుకొచ్చిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. వాటిపై అభ్యంతరాలను స్వీకరించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో వచ్చిన అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించిన నిపుణుల కమిటీ వాటికి సంబంధించి టీఆర్‌ఈఐఆర్‌బీకి సిఫార్సులు చేసింది.

వీటిని పరిశీలించిన అధికారులు వాటి ఆధారంగా తుది కీలను ఖరారు చేశారు. వీటిని టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు. మొత్తంగా 51 కేటగిరీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించిన ఫైనల్‌ కీలు తాజాగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన తుది కీలలో ఇకపై ఎలాంటి మార్పులు ఉండవని గురుకుల బోర్డు స్పష్టం చేసింది.

రోస్టర్‌ పాయింట్ల మార్పులు...
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్‌ చార్ట్‌ కీలకంగా  పనిచేస్తుంది. ఈ చార్ట్‌లో నిర్దేశించిన రిజర్వేషన్ల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. తాజాగా రోస్టర్‌ పాయింట్లలో కొన్ని రకాల మార్పులు చేస్తూ సవరించిన రోస్టర్‌ జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

ఇందులో ప్రధానంగా 13, 37 (ఎక్స్‌ సర్వీస్‌మెన్‌) రోస్టర్‌ పాయింట్లలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. సొసైటీ వారీగా నిర్దేశించిన పోస్టు కేటగిరీల్లో ఈ పాయింట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదివరకు ప్రకటించిన పాయింట్లు... తాజాగా సవరించిన పాయింట్లతో కూడిన జాబితాను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో
ఉంచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement