
అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీ రుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ గోషామహల్‌లోని పోలీస్ స్టేడి యంలో అమరవీరుల స్తూపానికి మంగళవారం నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి సహా పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ అమరవీరుల కుటుంబాలు పాల్గొననున్నాయి. ఈ మేరకు డీజీ పీ శివధర్‌రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించా రు.
ఈనెల 21నుంచి 31వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపను న్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పో లీస్ కార్యాలయాలలో సంస్మరణ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు పోలీస్ స్టేషన్ పరి«ధులలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన 31వ తేదీన జరగనున్న జాతీయ సమైక్యతా దినం వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.
తెలంగాణ కు చెందిన పోలీస్ సిబ్బంది ఐదుగురు సహా దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో తమ ప్రాణా లను అర్పించారని తెలిపారు. ‘అక్టోబర్ 22 –24 మధ్య మర ణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలను సందర్శించి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తారు. అమరవీరుల విగ్రహాలకు, ఫొటోలకు వారి స్వగ్రామాలలో పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు.