NEET UG 2022: నీట్‌లో తెలంగాణ విద్యార్థికి ఐదో ర్యాంకు

Telangana Student Bags All India 5th Rank In NEET UG 2022 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయి వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షలో తెలంగాణ విద్యార్థులు మెరుపులు మెరిపించారు. బుధవారం అర్ధరాత్రి ప్రకటించిన నీట్‌ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థి ఎర్రబెల్లి సిద్ధార్థరావు జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. రాష్ట్రానికి చెందిన చప్పిడి లక్ష్మీచరిత 37వ ర్యాంకు, కె.జీవన్‌కుమార్‌రెడ్డి 41వ ర్యాంకు, వరం అదితి 50వ ర్యాంకు, యశస్వినిశ్రీ 52వ ర్యాంకు సాధించారు.
నీట్ యూజీ-2022 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

బాలికల కేటగిరీలో చూస్తే.. చప్పిడి లక్ష్మీచరిత జాతీయ స్థాయిలో 14వ ర్యాంకులో నిలిచారు. ఇక ఎస్టీ కేటగిరీలో జాతీయ టాపర్‌గా తెలంగాణకు చెందిన ముదావత్‌ లితేష్‌ చౌహాన్, రెండో ర్యాంకును గుగులోతు శివాని సాధించారు. లవోడ్య బృంద ఐదో, బూక్యా అనుమేహ ఆరో ర్యాంకులు సాధించారు.

ఓబీసీ కేటగిరీలో చూస్తే.. యశస్వినీశ్రీ ఎనిమిదో ర్యాంకు పొందారు.  తెలంగాణ నుంచి నీట్‌ కోసం 61,207 మంది రిజి్రస్టేషన్‌ చేసుకోగా.. 59,296 మంది పరీక్ష రాశారు. ఇందులో 35,148 మంది నీట్‌కు అర్హత సాధించారు. గతేడాది అర్హుల సంఖ్య 28,093 మందే కావడం గమనార్హం. ఐదో ర్యాంకు సాధించిన విద్యార్థి తమ కాలేజీలో చదువుకున్నాడని శ్రీచైతన్య కూకట్‌పల్లి బ్రాంచి డీన్‌ శంకర్‌రావు తెలిపారు. ఏపీకి చెందిన దుర్గ సాయి కీర్తితేజ 12వ, ఎన్‌.వెంకటసాయి వైష్ణవి 15వ జాతీయ ర్యాంకులు సాధించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top