Sakshi News home page

హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో..

Published Tue, May 9 2023 12:37 PM

Telangana Hyderabad Witnessed Zero Shadow Day 2023 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. రెండు నిమిషాలపాట నీడ మాయమైంది. మధ్యహ్నం 12:12 నుంచి 12:14 గంటల మధ్య మనుషులు, వస్తువుల నీడ కన్పించలేదు. సూర్య కిరణాలు నడినెత్తి మీద పడటంతో షాడో మాయమైంది. దీన్ని 'జీరో షాడో డే'గా పిలుస్తారు.

నీడ మాయమవుతుందని తెలియడంతో నగరంలో అనేక మంది రోడ్ల మీదకు వచ్చి గుమిగూడారు. నీడ పడుతుందో లేదో చెక్ చేశారు. 12:12 నుంచి 12:14 వరకు షాడో మాయం కావడం ప్రత్యక్షంగా వీక్షించారు. వస్తువులను కూడా రోడ్లపై పెట్టి షాడో పడుతుందో లేదో పరీక్షించారు.

ఒక వస్తువుపై సూర్య కిరణాలు పడితే.. ఆ కోణానికి వ్యతిరేక దిశలో ఆ వస్తువు నీడ ఏర్పడ టం సాధారణం. కానీ దీనికి భిన్నంగా ఉష్ణమండలంలో (23.4నిఎన్‌ కర్కాటక రాశి–23.4నిఎస్‌ మకర రాశికి మధ్య అక్షాంశంలో) నీడలేని రోజు సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ ఏడాది లో నీడ లేని రోజు మే 9(నేడు), ఆగస్టు 3వ తేదీ ల్లో కన్పిస్తుంది.

ఏడాది పొడవునా సూర్యకిరణా లు ప్రసారమయ్యే కోణాన్ని బట్టి వాటి నీడల పొడవు, దిశ మారుతూ ఉంటుంది. భూభ్ర­మణం అక్షం సమతలానికి 23.45 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. భూమి–సూర్యుని మధ్యరేఖను సౌర క్షీణత అని పిలుస్తారు. ఈ సౌరక్షీణత సూర్యకిరణాలు పడే అక్షాంశానికి సమానమైనప్పుడు జీరో షాడో డే ఏర్పడుతుంది
చదవండి: ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్‌ చేసుకోండి..

Advertisement

What’s your opinion

Advertisement