
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
షేక్‌పేట, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ , లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో వర్షం పడుతోంది. మరోవైపు.. జడివానకు రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది కూడా.

#HYDTPinfo #RainAlert#Raining in Hyderabad City.
Commuters drive safely.#HyderabadRains pic.twitter.com/nruHbUJ8pW— Hyderabad Traffic Police (@HYDTP) July 26, 2025