వీసీల నియామక ప్రక్రియ వేగవంతం చేయండి

Telangana Government Plans To Recruit Vice Chancellors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీల వైస్‌చాన్స్‌లర్ల నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. వచ్చేనెల 7న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బుధవారం ప్రగతిభవన్‌లో పలువురు ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. వీసీల నియామకానికి సంబంధించి ఇప్పటికే సెర్చ్‌ కమిటీల ఏర్పాటు పూర్తయిందని, ఎంపిక కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఇప్పటివరకు కరోనా కారణంగా వీసీల నియామకంలో జాప్యం జరిగినందున.. ఇకపై ఆలస్యం చేయొద్దని సూచించారు. వీసీల నియామక ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ప్రజోపయోగ కార్యక్రమాలపై చర్చ..: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ విప్‌లు గొంగిడి సునీత, రేగా కాంతా రావు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, చల్లా ధర్మారెడ్డి, గణేశ్‌ గుప్తా, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top