టీఎస్‌ అసెంబ్లీ: ఫారెస్ట్‌ అధికారి శ్రీనివాస్‌ను ఎవరు చంపారు?: కేసీఆర్‌

Telangana Assembly Budget Sessions 10th February Live Updates - Sakshi

అప్‌డేట్స్‌

►బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు అసెంబ్లీలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా వెళ్తే.. వాళ్ల ఫ్రెండ్‌కు గనులు వస్తాయని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్ముతుంది కేంద్రం కాదా అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రసంగం

  • పోడు భూములంటే దురాక్రమణే
  • అడవులను నరికేయడం కరెక్టేనా
  • ప్రభుత్వ షరతులు ఒప్పుకుంటేనే పోడు భూములు పంపిణీ
  • పోడు భూములు న్యాయపరమైన డిమాండ్‌ కాదు
  • ఫారెస్ట్‌ అధికారి శ్రీనివాస్‌ను ఎవరు చంపారు
  • గొత్తికోయల గూండాగిరి మంచిది కాదు
  • ఫిబ్రవరిలో పోడు భూముల పంపిణీ
  • పోడు భూములకు విద్యుత​్‌, రైతు బంధు ఇస్తాం
  •  అటవీ సంపదకు ఇబ్బంది కల్గిస్తేనే పోడు భూములు రద్దు

రాష్ట్రంలో గుణాత్మక, విప్లవాత్మక మార్పులు రావడానికి కారణం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమేనని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య రంగాన్ని పటిష్టం చేశారన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ‘సమైక్య రాష్ట్రంలో 20 యేండ్లకు ఒక్క కాలేజ్ మాత్రమే పెట్టారు. సీఎం కేసీఆర్ మాత్రం ఒక్క సంవత్సరం లోనే 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మెడిజల్ కాలేజీలు లేక ఉక్రెయిన్తోపాటు ఇతర దేశాలకు వెళ్లారు.

ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి. వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాము. మహబూబ్ నగర్ లో ఇప్పటికే మూడు వచ్చాయి రానున్న రోజుల్లో మరో రెండు వస్తాయి.  కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే రాష్ట్రానికి ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. అప్పటి వైద్యారోగ్యా శాఖ మంత్రులు లేఖలు రాసినా పట్టించుకోలేదు’ అని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top