
బాసర: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ గదిలో ప్రవీణ్ కుమార్ అనే విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అధికారులు తెలిపారు.
ప్రవీణ్ కుమార్‌ను నాగర్‌కర్నూల్‌కు చెందిన విద్యార్ధిగా గుర్తించారు. బాసర ట్రిపుల్ ఐటీలో గతంలోనూ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే.