దేశదిమ్మరిలా తిరగడానికే కేసీఆర్ విమానం కొంటున్నారు

సాక్షి, హైదరాబాద్: ‘ఎవని పాలయ్యిందిరో తెలంగాణ’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. జాతీయ పార్టీ అవసరాల కోసం కేసీఆర్ సొంత విమానాన్ని కొనుగోలు చేస్తున్నారని పత్రికల్లో వచ్చిన కథనాలను ఉటంకిస్తూ ఆయన తన ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యను పోస్టు చేశారు.
‘అమరవీరుల కుటుంబాలను కలిసింది లేదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఏనాడూ పరామర్శించ లేదు. ప్రగతి భవన్ ఏసీ గదిని వీడింది లేదు. ఫాంహౌస్ దాటింది లేదు. దేశదిమ్మరిలా తిరగడానికి విమానం కొంటున్నాడట. ఎవని పాలయ్యిందిరో తెలంగాణ’ అంటూ శుక్రవారం ట్వీట్‌లో రేవంత్ ఎద్దేవా చేశారు.
చదవండి: సాగరహారంపై ‘పిట్ట పోరు’.. కేటీఆర్–రేవంత్‌ల మాటల యుద్ధం
మరిన్ని వార్తలు